![]() |
సీనియర్ నటి అనుష్క కి అంత తొందర ఎందుకో ? |
సీనియర్ నటి అనుష్క కి అంత తొందర ఎందుకో ?
ఇది
సినిమాల విషయంలో కాదు లెండి. ఆస్తుల విషయంలో! మామూలుగా హీరోయిన్లు తాము
సంపాదించిందంతా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది
భూముల మీద పెట్టుబడి పెడతారు. టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి కూడా భూముల
మీదే తను సంపాదించింది పెట్టిందంతా అప్పుడెప్పుడో అంటే తెలంగాణా రాకముందు
హైదరాబాద్ లోని ఓ పోష్ లొకాలిటీలో ఓ అపార్టుమెంటులో ఖరీదైన ఫ్లాటు కొనుగోలు
చేసింది.
Also Read : సయానీ గుప్తా ఏకపాత్రాభినయం చేయనున్నది నిజమా ?
తెలంగాణా వచ్చిన తరువాత భూముల ధరలు పడిపోతాయేమో అన్న అనుమానంతో దాన్ని ఐదుకోట్లకు అమ్మేసింది. ఇప్పుడా ఫ్లాట్ పది నుంచి పదిహేను కోట్లు పలుకుతోందట! వైజాగ్లో కొనుగోలు చేసిన భూముల విషయంలోనూ అలాగే తొందరపడింది. బాబుగారి పాలనలో అమరావతి బాగుపడుతుంది..వైజాగ్ భూములు బాగుపడవు అన్న ఉద్దేశంతో వాటిని అమ్మేసుకుంది. ఇప్పుడేమో వైజాగ్ భూములకు రెక్కలొచ్చేశాయ్. ఇదంతా చూసి అనుష్క తాను తొందరపడ్డాను అని ఇప్పుడు బాధపడుతుంది సినిమాల విషయంలో కూడా తొందరపడి లేనిపోని ప్రయోగాలు చేయడం తర్వాత బాధపడడం అనుష్క అలవాటైపోయిందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....