నేను తెలుగు అమ్మాయినే..నేను ఇన్నాళ్లు తెలుగు సినిమా చేయకపోవడానికి కారణం అదే..
నేను తెలుగు అమ్మాయినే - ఐశ్వర్య రాజేష్ :
ముద్దు సనివేశాలు ఉన్నంత మాత్రాన ఏ చిత్రమూ చెడ్డది కాదు. అవి లేకపోతే మంచిదనే చెప్పాలి ఏదైనా కథలో అవసరమై కథలో భాగంగా ఉండాల్సిందే..
నేను తెలుగమ్మాయినే. ' కౌసల్య కృష్ణమూర్తి', 'మిస్ మ్యాచ్' చిత్రాల్లో నటించా. నేను పుట్టి, పెరిగిందంతా కూడా చెనైలోనే. ఇక నేను నటిగా మారాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు ఓ మంచి చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టాలి అన్నారు , కానీ నాకు ఇక్కడ ఎవరిని సంప్రదించాలో , ఎలా సంప్రదించాలో తెలియదు. మళ్ళీ దానికితోడు ఇక్కడ గ్లామర్ కథానాయికలకు ప్రాదాన్యం ఎక్కువ. ఏ పాత్రకైనా సిద్ధంగా ఉండాలి ఇక్కడ. నేనలా చెయ్యలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి.
Also Read : మంచి అవకాశం కోసం నిరంతరం తపిస్తూనే ఉండాలి..
ఈ పరిశ్రమకు నేను సరిపోతానో లేదో అనే భయం ఉండేది. అందుకే మాతృభాషలోకి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఇకపై మాత్రం తెలుగులో ఏదాదికి రెండు చిత్రాలైనా సరే చెయ్యాలనుకుంటున్నాను. అదలాఉంటే నాకు జయలలిత అంటే ఇష్టం. అలాగే సౌందర్య గారన్న కూడా చాలా ఇష్టం. ప్రస్తుతం నానితో కలిసి 'టక్ జగదీష్" చేస్తున్నాను.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....