విజయ్ ఈ పరిస్థతి లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు?

What-kind-of-decision-will-Vijay-thalapathy-take-in-this-situation
విజయ్ ఈ పరిస్థతి లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు? 

విజయ్ ఈ పరిస్థతి లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు :

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా ఈ సినీ గ్లామర్ చుట్టూనే తిరుగుతుంటాయి. అన్నాదురై మొదలు దాదాపుగా ప్రతి నటుడు మరియు నటి ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంటారు. ఎమ్జీఆర్ కరుణానిధి, జయలలిత, విజయ్ కాంత్ నేరుగా రాజకీయాలతో సంబంధం ఉంది. వీరికి తోడు ఇప్పుడు రజనీకాంత్ మరియు కమలహాసన్ సైతం రాజకీయ తెరపై రాణించేందుకు మహా ఉత్సాహ చూప్పుతున్నారు. తమిళనాడు సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అప్పుడే అక్కడ రాజకీయల పై వేడి బాగానే రగులుకొంది. అయితే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుటో ప్రకటించారు. కానీ ఇంకా కార్యాచరణలోకి దిగలేదు ఈయన. 

కమల్ పార్టీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు పోటీ మాత్రం చేయలేదు. రజనీ, కమల్ రాజకీయంగా కలిసిపోతారేమో అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ విషయం మీద  ఇప్పటి వరకు స్పష్టతరాలేదు. ఇదిలా ఉంటే రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అపారమైన అభిమానగణం ఉన్న విజయ్ వారికి ప్రజాసేవ వైపు మళ్లించారు. తరచుగా బహిరంగ సభల్లో విజయ్ కనిపిస్తున్నారు. తన బలాన్ని చూపిస్తున్నారు. విజయ్ తండ్రి, ఒకప్పటి సినీ దర్శకుడు ఎ.చంద్రశేఖర్ మాత్రం విజయ్ రాజకీయ ప్రవేశాన్ని నిరాకరించారు. 


నిజానికి టాప్ హీరోగా మంచి పొజీషన్లో ఉన్న విజయ్ఇ ప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమి లేదు. కానీ తమిళ స్టార్స్ ఎందరు కూడా ఏదో ఒక పార్టీతో సంబంధం పెట్టుకుని ఉంటారు. ఆ ప్రభావం కూడా విజయ్ పై బాగా ఉంది. ఇటీవలే తానే సొంతంగా ఒక పార్టీని పెడితే ఎలా ఉంటుందని తన సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం ఓ నిర్ణయానికి రావాలి. ఇక లేదంటే వచ్చే ఎన్నికల్లో రజనీ, కమల్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో స్పష్టమయ్యాక, సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది చూద్దాం ఏం చేస్తారో.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....