మంచి అవకాశం కోసం నిరంతరం తపిస్తూనే ఉండాలి.. |
రాధికా ఆప్టే :
ఉద్యోగ భద్రత లేని రంగం మాది, మాకు ఇక్కడ ఎప్పుడు అవకాశాలు ఉంటాయో, ఎప్పుడు ఉండయో ఎవరికీ తెలియదు అంటోంది బాలీవుడ్ సుందరి రాధికా ఆప్టే. అందుకే మేము మంచి చిత్రాలు కోసం ఎప్పుడూ కూడా ఎదురుచూస్తుంటాం అని చెబుతుంది. అయితే మంచి చిత్రాలు నటిగా మరికొంత కాలం నిలబెట్టగలవు అనేది ఈ సుందరి నమ్మకం. రాధికా తన సినిమాలతో పాటు వివాదాలతోనూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ఇక ఈ సుందరి తెరంగేట్రం చేసి దాదాపుగా పుష్కర కాలమవుతోంది ఈ అనుభవంలో తగినంత గుర్తింపు సంపాదించుకుంది ఈమె.
సినిమాలు, సీరియల్ ఇంటర్నెట్ ధారావాహికలు, అంతర్జాతీయ చిత్రాలు ఇలా ఒకటేంటి రాధిక చాలా చోట్ల తన ప్రతిభ చూపిస్తోంది. అయినా వృత్తిపరంగా ఎప్పుడూ భయపడుతూనే ఉంటానని చెబుతోంది. రేపు ఏం చేయాలి అనే విషయంలో సందిగ్ధంలోనే ఉన్నట్లు తెలిపింది ఈ సుందరి. ఇటీవల రాధికా ఆప్టే మాట్లాడుతూ...అవకాశాలు భద్రత లేని పరిశ్రమ మాది. ఇక్కడ ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడు ఆగిపోతాయో మాకే కాదు ఎవరికీ తెలియదు.
Also Read : అన్నపూర్ణ స్టూడియో లో 'పివి సింధు' కి BMW కారు బహుమతి!
ప్రతిసారీ కొత్త తరహా కథలు పట్టుకోవడం, వాటిలో నటించడం చాలా కష్టం. అదృష్టవశాత్తూ కొన్ని కొన్ని మంచి కథలు దొరుకుతుంటాయి. ఇలా ప్రతిసారీ మంచి సినిమా కోసం ఆశిస్తూనే ఉంటాం. రేపు ఎలాంటి సినిమా దక్కుతుంది అనే సందిగ్ధం ప్రతిసారీ ఉంటుంది. మంచి సినిమాలు దక్కితేనే మన పేరు నిలబడుతుంది ఇక్కడ. లేకుంటే త్వరగానే మనల్ని మర్చిపోతారు అని చెప్పింది రాధికా ఆప్టే.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....