కొంతమంది అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు.. కానీ నేను ఆ పాత్ర చేయడానికి కూడా సిద్దమే..

varsha-bollamma-talks-about-her-roles-in-upcoming-movies
కొంతమంది అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు.. కానీ నేను ఆ పాత్ర చేయడానికి కూడా సిద్దమే..

వర్ష బొల్లమ్మ : 

కన్నడ భామలు చాలా మంది ఇక్కడ తెలుగు తెరపై  మెవరవడం, తెలుగు ప్రేక్షకులను మురిపించడం కొత్తేమీ కాదు. అయితే అలనాటి సౌందర్య దగ్గర నుండి నిన్నటి అనుష్క శెట్టి, నేటి పూజా హెగ్డే వరకూ ఎందరో చాలా మంది కన్నడ భామలు తెలుగు ప్రేక్షకులను తమ నటనతో మరియు అందచందాలతో అలరిస్తూ, ఆకట్టుకుంటున్నారు. వారి చెంతకు చేరింది వర్ష బొల్లమ్మ తెరమీద 'చూసీ చూడంగానే తెలుగువారిని ఆకట్టుకున్న వర్ష బొల్లమ్మ

మీ గురించి :

మైక్రోబయాలజీ చదివాను. నాకు చిన్నప్పటి నుండి కూడా నటన అంటే చాలా ఇష్టం. కాబట్టి కాలేజీలో స్టేజి పై నటించాలనుకున్నాను. కానీ మా కాలేజ్ డ్రామా ఆసోసియేషన్ వారు నన్ను సెలక్ట్ చేయలేదు. అయితే నేను తొలిసారి తమిళంలో 'వెట్రివేల్' అనే సినిమాను చేశాను. ఆ తర్వాత తమిళ హిట్ 90 లో నటించాను. మలయాళంలో కూడా సినిమాలు చేశాను. 36'లో నా నటనను చూసి శేష సిందు, రాజ్ కందుకూరి నాకు 'చూసీ చూడంగానే సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. నటనలో ప్రత్యేకించి ఆ ఒక్క శిక్షణ తీసుకున్న ప్రత్యేకించి నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సినిమాల్లోకి రాకముందు డబష్ వీడియోలు మాత్రమే చేసే దానిని. సినిమా సినిమాలో నా నటనను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతున్నాను. సినిమాల్లో అవకాశం కూడా నా డబష్ మెస్ వీడియో చూసే ఇచ్చారు.

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? 

సినిమా రంగం గ్లామర్ రంగమే అయినా, ఆ గ్లామర్ ఒక్కటే ఉంటే ఇక్కడ సరిపోదు. నటన వస్తే ఎక్కువ కాలం ఇక్కడ ఉండగలుగుతాం. అవసరమైతే డీగ్లామర్ పాత్రలు అయినా సరే చేస్తాను. కొంతమంది అలాంటి పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నాకు మాత్రం ఎలాంటి పాత్రలైనా ఒకే

డీగ్లామర్ పాత్రలు చేస్తే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతాయన్న భయం లేదా?

గ్లామర్‌గా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయంటే నేను దానిని నమ్మను. గ్లామర్తో పాటు నటన కూడా తప్పనిసరి. కథ బాగుండకపోతే సినిమా ఎలా ఆడదో అలాగే నటన రాకపోతే అవకాశాలు కూడా రావు ఇక్కడ అయితే తెరమీద గ్లామర్ గా కనిపించ నంటారా డీగ్లామర్ పాత్రలు కూడా చేస్తానంటే గ్లామర్ గా నటించనని కాదు కదా. సినిమాకు మరియు పాత్రకూ అనుగుణంగా అవసరమైతే గ్లామర్‌గా కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.


చూసి చూడంగానే డ్రమ్మర్ గా కనిపించారు కదా? 

ప్రత్యేకంగా శిక్షణ ఏమైనా తీసుకున్నా కథ విన్నప్పుడు నా పాత్ర డ్రమ్మర్ అని చెప్పగానే నేను చేయగలనా? అని కొంచెం భయపడ్డాను మొదట్లో. డ్రమ్మింగ్ గురించి నాకు ఏం తెలియకుండా చేయడం అంటే అది చాలా కష్టం. ఓ డ్రమ్ బ్యాండ్ నుంచి డ్రమ్ము కావాల్సిన బేసిక్స్ నేర్చుకున్నాను కానీ చేసేటప్పుడు కష్టంగానే అనిపించింది.మీరు కన్నడ కదా తెలుగు, తమిళ భాషలు కష్టంగా అనిపించింది కష్టపడలేదు అని మాత్రం చెప్పను. కోలీవుడ్లో మొదటిసారి సినిమా చేస్తున్నప్పుడు కష్టంగానే అనిపించింది కానీ ఇప్పుడు అంతకష్టంగాలేదు. కొద్దిగా తమిళ్ నేర్చుకున్నాను. తెలుగు కూడా షూటింగ్ సమయంలో కొద్దికొద్దిగా నేర్చుకోగలిగాను..

మీరు చేయబోతున్న తెలుగు సినిమాలు? 

ఆనంద్ దేవరకొండ సినిమాలో చేస్తున్నాను నేను అందులో గుంటూరు అమ్మాయిగా కనిపించబోతున్నాను. తెలుగులో చాలా కథలు విన్నాను కానీ ఇంకా వేటికీ ఓకే చెప్పలేదు. తమిళంలో కూడా రెండు సినిమాలు చేయబోతున్నాడు.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....