రొమ్ము క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణం ఇదే అంటున్నారు నిపుణులు!!! |
రొమ్ము క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణం :
రొమ్ము క్యాన్సర్ అనేది అసల ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే దానికి ఇప్పటివరకూ సరైన కారణం తెలీదు. అయితే మొట్టమొదటగా డీఎన్ఏలో 350 లోపాలు ఉండటం వల్లన్నే ఇది వస్తుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నిపుణులు గుర్తించారు. పైగా ఈ లోపాలకు 190 జన్యువులు కారణమవుతున్నాయట. ఇందుకోసమని కొందరు పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 450 క్యాన్సర్ సంస్థల ద్వారా ఒక లక్ష పదివేల మంది రొమ్ము క్యాన్సర్ బాధితుల జన్యు ని విశ్లేషించారట.
Also Read : స్వదేశీ వాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చిన చైనా...
మానవ జన్యుపటంలో ని సుమారుగా 20 నుంచి 25 వేల వరకూ జన్యువులు ఉంటాయి. అయితే చాలావరకూ వ్యాధులన్నీ కూడా ఏ ఒక్క జన్యులోపం వల్లో కాకుండా అనేక జన్యులోపాల వల్లే వస్తుంటాయి. అలాగే రొమ్ము క్యాన్సర్ కూడా ఈ కోవకు చెందుతుంది. కాబట్టి ఈ సరికొత్త పరిశోధన ఆధారంగా- డీఎన్ఏ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించి, ఆయా జన్యు లోపాల్ని హార్మోన్ల చికిత్స ద్వారా సరిచేయవచ్చు అని అభిప్రాయపడుతున్నారు సదరు నిపుణులు.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....