ఆ ఊరులో ఉన్న వాళ్ళు అందరూ వితంతువులే!

Mysterious-facts-about-village-of-widows
ఆ ఊరులో ఉన్న వాళ్ళు అందరూ వితంతువులే!

ఆ ఊరులో ఉన్న వాళ్ళు అందరూ వితంతువులే :

ఇది మీకు కొంచెం వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అక్కడ ఉన్న వితంతువులది ఒక్కొక్కరిది ఒక్కొక కన్నీటి కథగా చెప్పొచ్చు. కానీ ఆ వితంతువుల కన్నీళ్లకు కారణం అనేది మాత్రం ఒకటే అందేంటంటే ఓపియం (నల్లమందు). ఆ నల్లమందు ఇప్పుడు వాళ్ళ పిల్లల బతుకుల్ని కూడా ఆగం చేస్తుందనే భయంతోనే వారు గడుపుతున్నారు. 

ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడంటే 'ఖ్వాలా-ఇ-బివాహ' అఫ్ఘానిస్తాన్ లో పడమర వైపుగా హెరాత్ అని పిలవబడే సిటీకి దగ్గరలో వుండే ఒక చిన్న విలేజ్ ఈ ఊరిని అందరూ 'విలేజ్ ఆఫ్ విడోస్' గా పిలుస్తారు. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే దానికి ఒక మిస్టరీ వుంది అదేంటంటే అఫ్ఘానిస్తాన్ నుండి ఇరాన్ కి నల్లమందు రవాణాలో ఈ విలేజ్ ఆఫ్ విడోస్ యే ఒక దారి. నల్లమందు రవాణాలో ఒక ట్రిప్ కి గాను ఒక వ్యక్తికి 300 డాలర్స్ వరకు ఇచ్చేవారు. అప్పుడు వాళ్ళ పేదరికం మరియు పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి మరోక దారిలేక చాలామంది అక్కడివాళ్లు ఈ వృత్తి లోకి అనగా స్మగ్లింగ్ లోకి దిగుతుంటారు. 

ఇలా స్మగ్లింగ్ చేస్తూ వారు పోలీస్ లకి దొరికిపోయి ఇరాన్ దేశ చట్టాల ప్రకారము వారు మరణ శిక్షలకు బలి అయ్యేవారు. దీనితో అక్కడి ఆడవాళ్ళు అంతా ఖ్వాలా-ఇ-బివాహలోని సెటిల్ అయిపోతుంటారు. మట్టి గోడలతో నిర్మించే పాకలు కట్టుకుని నివసిస్తుంటారు. అక్కడ వారు నివసించడానికి తివాచీలను నేయడం మరియు గొర్రెలను పెంచడం వాటి ద్వారా వచ్చిన ఉన్నిని అమ్ముకుంటూనే వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....