బెస్ట్ డైట్ | 2021 | In Telugu |
బెస్ట్ డైట్ :
డైట్ చేయడం అంటే తిండి మానేయడం కాదు, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం. మన ఆరోగ్యానికి పునాది ఏంటంటే అది ఆహారమే అని చాలా క్లియర్ గా చెప్పొచ్చు. చక్కటి ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం అనేది మన సొంతం అవుతుంది. అమెరికా దేశానికీ చెందిన 'US News and World Report' వారు సంవత్సరానికిగాను బెస్ట్ డైట్ అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి దీని ప్రకారం మనం తినడం వల్ల బరువు పెరగరు అంతేకాదు హార్ట్ సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చని అంటున్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం 'మెడిటరేనియన్ డైట్' బెస్ట్ డైట్ గా నిలిచింది. ఈ బెస్ట్ డైట్ ను ఇటలీ, స్పెయిన్, మాల్టా, ఫ్రాన్స్, స్లోవేనియా, అల్బేనియా మరియు గ్రీస్ ఇలా మెడిటరేనియన్ అని పిలవబడే సముద్ర తీరాన్ని కలిగి ఉన్న దేశాలు ఈ డైట్ ని పాటిస్తాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం మిగతా దేశాలతో పోల్చి చూస్తే ఈ దేశాలలో ప్రజలు చాలా తక్కువగా గుండె జబ్బులకు గురవుతున్నారు. ప్రపంచం కూడా అందుకే వారి యొక్క డైట్ ని మెడిటరేనియన్ డైట్ అని పేరు పెట్టింది. అంతే కాకుండా దాన్ని ప్రాచుర్యంలోకి కూడా తెచ్చారు. Food Corporation అనగా ఆరోగ్య సంస్థ కూడా వారియొక్క ఆహారాన్ని మెచ్చుకోవడం జరిగింది.
ఇంతకీ వాళ్ళ యొక్క బెస్ట్ డైట్ లో ఆలివ్ నూనె, సీ ఫుడ్స్, చిక్కుడుకాయ జాతి కూరగాయలు మరియు ఆకుకూరలు, నట్స్, సీడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు రోజూ ఈ డైట్ నే ఆహారంగా తీసుకుంటారు అంట. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కుగా ఆలివ్ నూనెల్లో వేయించినవి, ఉడకబెట్టిన గుడ్లు మరియు కూరగాయలు తింటుంటారు. ఓట్స్, గ్రీకు యోగర్ట్, స్థాబెర్రీలు, వంటివి ఎక్కువగా తింటారు. ఈ మెడిటరేనియన్ డైట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమం అయినదిగా గుర్తింపు పొందింది.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....