బ్లాక్ క్యారెట్ 'కాలా గాజర్' వల్ల ఎన్ని ఉపయోగాలో?

health-benefits-and-facts-about-black-carrot-kali-gajar
బ్లాక్ క్యారెట్ 'కాలా గాజర్' వల్ల ఎన్ని ఉపయోగాలో?

బ్లాక్ క్యారెట్ కాలా గాజర్ వల్ల ఎన్ని ఉపయోగాలో :

కాలా గాజర్ : మనకి రోజూ మార్కెట్ లో ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడుతూ మెరిసే క్యారెట్ లు సాధారణంగా మనం అందరూ నిత్యం తినేవే. క్యారెట్ లలో కూడా కొన్ని రకాలు ఉంటాయి అందులో బ్లాక్ కలర్ లో ఉండే క్యారెట్లను 'కాలా గాజర్' అంటారు. ఇవి ఒకసారి బాగా నలుపు రంగులో ఉంటాయి, మరి కొన్నిసార్లు అయితే బీట్రూట్ కలర్లో కనిపిస్తుంటాయి. మనకి నిత్యం కనిపించే క్యారెట్ లతో పోలిస్తే ఈ కాలా గాజర్ క్యారెట్ వల్ల చాలా రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. కానీ ఆరెంజ్ కలర్ లో వుండే క్యారెట్లతో పోల్చి చూసినప్పుడు వీటి యొక్క రుచి కాస్త తేడా గానే ఉంటుంది.


ఉపయోగాలు :

  • ఈ కాలా గాజర్ క్యారెట్లలో ఆంథోసైనిన్ అనబడే కాంపౌండ్ ఉండటం వల్ల వాటికి బ్లాక్ కలర్ వస్తుంది. ఆంథోసైనిన్ కాంపౌండ్ అనేది క్యాన్సర్ కణాలతో పోరగలిగే శక్తి మన శరీరానికి అందిస్తుంది. 

  • ఆరెంజ్ కలర్ క్యారెట్ లలో ఉన్నట్లుగానే కాలా గాజర్ లో కూడా బీటాకెరాటిన్ అనేది కూడా ఉంటుంది. ఈ బీటాకెరాటిన్ మన కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది. కంటిలోని కణాలకు కూడా రక్షణగా నిలుస్తుంది.


  • ఈ కాలా గాజర్ క్యారెట్లలో పీచుపదార్థం అధికం గా ఉంటుంది. జీర్ణక్రియ ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ కాలా గాజర్ క్యారెట్ లని తినటం వలన డైజీషన్ సిస్టమ్ పనితీరు మెరుగవ్వడంతో పాటుగా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.


  • ఈరోజుల్లో చాలా ఎక్కువ మంది పెద్దవారిలో కనిపిస్తున్న సమస్య ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. క్యారెట్ లలో వుండే యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, యాంటి గుణాలు అనేవి బాగా పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆర్థరైటిస్ను సాధ్యమైనంతవరకు నిరోధిస్తాయి అనే చెప్పొచ్చు.

  • ఈరోజుల్లో ఎక్కువ గా వయసు పెరుగే కొలద్దీ కొందరిలో మతిమరుపు అనే సమస్య కనిపిస్తుంది. అలాంటివాళ్ళు బ్లాక్ క్యారెట్ లని తినటం అలవాటు చేసుకోవడం మంచిది. ఈ కాలా గాజర్ క్యారెట్ లు అల్జీమర్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.


  • ఏదైనా సరే ఎక్కువగా తినటం వల్ల కూడా ప్రమాదమే. అలాగే కాలా గాజర్ క్యారెట్ లు కూడా ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు, రక్తపోటులో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు రావచ్చు, లిమిట్ గా తీసుకోవడమే చాల మంచిది అంటే రోజుకి 1 లేదా 2 తినడం మంచిది.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....