చంద్రుడు భూగ్రాహం నుంచి దూరంగా జరగడానికి కారణం ఏంటి?

reasons-behind-moon-moving-away-from-the-planet
చంద్రుడు భూగ్రాహం నుంచి దూరంగా జరగడానికి కారణం ఏంటి?

చంద్రుడు భూగ్రాహం నుంచి దూరంగా జరగడానికి కారణం ఏంటి? :

ఆకాశంలో చంద్రుడు మనకు చల్లని వెన్నెలను ఇస్తాడు. ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాల మధ్య రోజు వెలిగిపోతూ వెన్నెల పూలను మనపై కురిపిస్తాడు. అటువంటి చంద్రుడు భూగ్రాహం నుంచి దూరంగా వెళ్లిపోతున్నాడని ఈ రోజున శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని బాగా పరిశీలించి చూస్తే, చంద్రుడు భూగ్రాహం నుంచి సంవత్సరానికి 1 సెం.మీ దూరంగా జరుగుతున్నాడు. ఈ కదలిక మనవిశ్వంలో భూమి మరియు చంద్రుడు ఏర్పడినప్పటినుంచి ఉంది. దాని కారణంగానే భూగ్రాహం చుట్టూ చంద్రుడు పరిభ్రమించే(తిరిగే) కక్ష్య యొక్క పొడవు ఎక్కువ అవుతోంది. వందలకోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కేవలం 20 రోజులు సమయం మాత్రమే పట్టేది. కానీ ప్రస్తుతం మాత్రం సుమారు 28 రోజులు సమయం పడుతుంది. 

మనం ఫిజిక్స్ లో చదివిన విధంగానే "కోణీయ ద్రవ్యవేగ సూత్రాన్ని (The principle of angular velocity)" ని అనుసరించి చూస్తే భూమిని కోల్పోయే భ్రమణవేగం అనేది చంద్రునికి లభిస్తుంది. అనగా భూగ్రాహం తనచుట్టూ తాను తిరిగే కాలం 24 గంటల కన్నా క్రమ క్రమంగా పెరుగుతుంది. 1000 సంవత్సరాల కాలంలో భూగ్రాహం పై ఒక రోజు కాలసమయం ఇప్పటికన్నా 20 మిల్లీ సెకన్స్ ఎక్కువ అవుతుంది. ఈ విధమైన ప్రక్రియ ఒకరోజు కాలసమయం ఒక నెల కాలం అయ్యేవరకు కూడా కొనసాగుతుంది. ఈ లోపు సూర్యుడు Red Giant గా మారి భూ గ్రహాన్ని  దానితోపాటు చంద్రుడ్ని కూడా శోషిస్తాడు. అయితే ఈ విధంగా జరగటానికి చాలా కాలం పడుతుంది అని Astronomers చెబుతున్నారు.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....