పళ్ళు గారగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారా :
నువ్వు అయినా నేను అయినా ఎవరైనా సరే నవ్వితేనే బాగుంటారు. అలాగే కొంతమంది ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ కూడా చెదరకుండా అలానే ఉంటుంది. అలాంటి వాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది కూడా. పదిమందిలో ఉన్నప్పుడు నవ్వాలంటే పలువరుస కూడా బాగుండాలి. దంత సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ఎంత శుభ్రం చేసుకున్న కూడా మనలో చాలామందికి దంత సమస్యలు వస్తూ ఉంటాయి. ఇందువల్ల నలుగురిలో నవ్వాలంటే చాలా ఇబ్బందిగా భావిస్తుంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. దంతాలను సంరక్షించుకోవాలంటే ఏంచేయాలి? ఎలాంటి ఆహారాన్ని తినాలి? ...ఇలాంటి సందేహాలు చాలామందిని వెంటాడుతూ, వేధిస్తుంటాయి.
పాటించాల్సిన నియమాలు :
• కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు సహజ మెరుపుని కోల్పోతాయి. మల్లీ తిరిగి వాటిని అసలు రంగుకి తెప్పించటం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉండాలి.
• టూత్ వైటెనింగ్ ట్రీట్మెంట్ మాలిక్ యాసిడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది యాపిల్స్ లో సమృద్ధిగా ఉంటుంది. యాపిల్స్ తరచూ తింటూ ఉంటే దంతాలు కూడా తెల్లబడతాయి.
* క్యారెట్, దోసకాయ ముక్కలను తరచుగా నములుతూ ఉండాలి.
• నోట్లో ఇరుక్కుని ఉండిపోయే పదార్థాల వల్ల కూడా దంతాలు తెల్లదనాన్ని కోల్పోతాయి. ఆహారం తిన్న తర్వాత నోటిని ఎక్కువ నీళ్లతో పుక్కిలించాలి.
• తాజా స్ట్రాబెర్రీ గుజ్జును దంతాలపై రుద్దుకుంటే పళ్లు తెల్లబడతాయి. ఈ పళ్లలో గాఢమైన యాసిడ్స్, షుగర్స్ ఉంటాయి. కాబట్టి రుద్దుకున్న వెంటనే టూత్ బ్రష్ తో పళ్లు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.
Also Read : రక్త ప్రసరణ వల్ల వచ్చే అనేక సమస్యలు...తీసుకోవాల్సిన జాగ్రతలు.
• కొన్ని చుక్కల నిమ్మరసంలో చిటికెడు ఉప్పు కలిపి బ్రష్ తో దంతాలపై రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. నిమ్మరసంతో రుద్దుకున్న వెంటనే మళ్లీ టూత్ పేస్ట్' దంతాలు శుభ్రపరుచుకోవాలి. లేదంటే నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది.
* ఎండు ద్రాక్ష తినటం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువ ఊరుతుంది. దాంతో పళ్ల మీద గార ఏర్పడకుండా ఉంటుంది. ఎనామిల్ ను దృఢపరిచే ఫాస్పరస్, కాల్షియం లు పాలు, పెరుగుల్లో ఉంటాయి. కాబట్టి పాలు, పెరుగు తీసుకుంటూ ఉంటే దంతాలు దృఢంగా,
ఆరోగ్యంగా ఉంటాయి.
* చిటికెడు బేకింగ్ సోడా అంతే పరిమాణంలో ఉప్పు, నీళ్లు కలిపి ఒక నిమిషంపాటు బ్రస్ తో దంతాలు రుద్దుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా వాసన వదిలేవరకూ నోరు నీటితో పుక్కిలించాలి. ఇలా వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలి.
బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి బ్రష్ చేసినా దంతాలు తెల్లబడతాయి.
• హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు సమపాళ్లలో కలిపి మౌత్ వాష్ గా ఉపయోగిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్లబడతాయి.
• 'క్సెలిటాల్ న్యాచురల్ స్వీటెనర్. ఇది ఉండే చూయింగ్ గమ్ ను నమలటం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా తయారై గార చేరకుండా ఉంటుంది.
• కాల్షియం కలిగిన పండ్లు ఆరోగ్యానికే కాదు. మన పళ్లకు కూడా బలవర్ధకమైన ఆహారం. తరచూ వాటిని తింటే.. పై పళ్లు, కింది పళ్లు బలంగా తయారవుతాయి. కొందరైతే నెలల తరబడి టూత్ బ్రష్ ను మార్చరు. కనీసం రెండు మాసాలకు ఒకసారైన బ్రష్ ను మారిస్తేనే మంచిది.
•అప్పుడప్పుడు చెరుకుగడల్లాంటివి తినండి. గట్టిగా ఉండే పండ్లను సైతం కొరుక్కుని తినాలి. ఇలాచేస్తే పళ్లు గట్టిపడతాయి. జ్యూస్లు తగ్గిస్తే బెటర్..
* రోజూ తెల్లటి టూత్ పేస్ట్ వాడే బదులు.. వారంలో రెండుసార్లు ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన పళ్లపొడులను కూడా వాడటం అలవాటు చేసుకోవాలి.
• ఎప్పటి నుంచో వాడుతున్న వేపపుల్ల కూడా మంచిది. నెలకు ఒకసారైనా తాజా వేపపుల్లతో పళ్లు తోముకోవలి.
* కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రషింగ్ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. . అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్ చేసుకోవాలి.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....