రక్త ప్రసరణ వల్ల వచ్చే అనేక సమస్యలు...తీసుకోవాల్సిన జాగ్రతలు.

Many-problems-with-blood-circulation-Precautions-to-be-taken
రక్త ప్రసరణ వల్ల వచ్చే అనేక సమస్యలు...తీసుకోవాల్సిన జాగ్రతలు.

తీసుకోవాల్సిన జాగ్రతలు :

రక్త ప్రసరణ అనేది శరీర ఆరోగ్యం లో ముఖ్య కీలక పాత్రను వహిస్తుంది. రక్తప్రసరణ అనేది మెరుగుగా ఉండాలి. రక్తంలో ఏ సమస్యలు తలెత్తకుండా ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే శారీరక సాధారణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. మెదడుకు తగిన విధంగా రక్త సరఫరా కొనసాగాలి. ఆ సరఫరాకి ఇబ్బంది కలిగించే అనారోగ్యాలు అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధులు. కాబట్టి ఈ రక్తపోటును అదుపులో ఉంచాలి రక్తంలో చక్కెరల స్థాయి మరీ అతిగా హెచ్చుతగ్గులు రాకూడదు. 

రక్తంలో లోపం అనేది ఏర్పడితే అది మెదడు యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు మెదడుమీద ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా పొగతాగే అలవాటు ఒకటి. ఆ అలవాటు చేసుకోకపోవటమే చాలా వరకు మంచిది. ఒకవేళ ఆ అలవాటు గనక ఉంటే దానిని ఒక వయసు తర్వాత మానేసుకోవాలి. రక్తపోటు, షుగర్ జబ్బుల వల్ల పక్షవాతం ప్రమాదం పెరుగుతుంది. 

Also Read : పళ్లు గారగా ఉన్నాయని నలుగురిలో  నవ్వుడానికి ఇబ్బంది పడే వాళ్లు ఇవి పాటించి చూడండి...

మెదడుకు వచ్చేపోటువల్ల డెమెన్షియా (చిత్తవైకల్యం), అల్జీమర్ జబ్బు వస్తుంది. ఆ జబ్బులు వస్తే వయసు మళ్ళిన జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు వారిని కనిపెట్టుకుని ఉండవలసిన పరిస్థితి.చిత్తవైకల్యం వస్తే ఇక చిక్కులు తప్పవు. ఆ స్థితికి చేరకుండా ఉండాలి అంటే మెదడు ఆరోగ్యం, ఆ ఆరోగ్యం కాపాడే శారీరక ఆరోగ్యం రెండింటిమీదా మీద శ్రద్ధ ఉండాలి.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....