అసలేంటి ఈ WhatsApp వివాదం...మన వ్యక్తిగత సమాచారంతో పనేంటి...?
అసలేంటి ఈ WhatsApp వివాదం... మన వ్యక్తిగత సమాచారంతో పనేంటి :
WhatsApp ఈరోజు ఇది ఒక హాట్ టాపిక్ అయిపొయింది WhatsApp వాడాలా...? SignalApp వాడాలా...? Telegram వాడాలా...? అనే ప్రశ్నలు ఈరోజు అందరిలోనూ కనిపిస్తున్నాయి దానికితోడు మనం ఒక వారం నుండి కూడా చూస్తున్నాం యూట్యూబ్ వీడియోస్ లో ఇంకా టెలివిషన్ ఛానెల్స్ లో చూస్తూనే ఉన్నాం వీటి కోసం. ఈరోజు మనం చూస్తున్నట్లైతే WhatsApp నుంచి పెద్ద యెత్తున వినియోగదారులు SignalApp మరియు Telegram వంటి మెస్సగింగ్ సర్వీసెస్ అందించే Apps కి వెళ్లిపోతున్నారు. WhatsApp నుంచి ఎక్కువ withdraw అవుతున్నారు అలాగే signalApp, telegram Apps డౌన్లో విపరీతంగా పెరిగాయి.
అసలు ఏంటి ఏంజరిగింది ? ఏంటి ఈ WhatsApp వివాదం ?
అందరికి అర్ధమయ్యే విధంగా సింపుల్ గా చెప్పాలి అంటే WhatsApp అనే messaging సర్వీస్ అప్ ని Facebook 2014 లో కొనడం జరిగింది, కొనుగోలు చేసిన సమయంలో ఒక హామీ వినియోగదారులకి ఇవ్వడం జరిగింది అది ఏంటంటే whatsApp డేటా ను Facebook తో షేర్ చేసుకోము అని ఎందుకంటే రెండు ఒక కంపెనీ అయినప్పుడు ఆటోమేటిక్ గా డేటా అనేది షేరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. డేటా అనగా సంబందించిన అన్ని విషయాలు డేటా నే అవుతుంది మన ఫోన్ నెంబర్ తో మొదలుకుని ప్రైవేట్ డేటా, అమ్మకాలు మరియు కొనుగోళ్ళు & మనకు సంబందించిన transactions, Payments and interactions మరియు Chatting Conversations ఇవ్వన్నీ కూడా మన ప్రైవసీ డేటా అవుతుంది. అందువల్ల ఈ డేటా ను తీసుకెళ్లి Facebook కి ఇవ్వడం అనేది ఇల్లీగల్ అవుతుంది. అందుకే 2014 లో Facebook కొనుగోలు చేసేటప్పుడు ఈ డేటా Privacy ని ప్రొటెక్ట్ చేస్తాం మేము Facebook తో వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసుకోము అని హామీ ఇచ్చారు కానీ ఈ హామీ ని రెండేళ్లలో ఉల్లంఘించారు.
2016 వ సంవత్సరానికి వచ్చేసరికి ఈ డేటా Privacy రూల్స్ ను WhatsApp సడన్ గా మార్చేయడం జరిగింది. ఆ విధంగా మార్చేటప్పుడు ఏమన్నారు అంటే మేము Facebook తో మీ డేటా ని షేర్ చేసుకోబోతున్నాం మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే షేర్ చేసుకోవద్దు అని చెప్పొచ్చు అని ఒక 30Days నోటీసు ఇచ్చారు. చాలామంది అసలు ఆ నోటీసు చుసిన వాళ్లు చాల తక్కువ, facebook తో డేటా షేర్ చేసుకోవద్దు అని అడిగినవాళ్లు తక్కువే, ఇక కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లకు ఎనిమిది వేల పదాలు వున్నా ప్రైవసీ నోట్ వచ్చేది దాన్ని ఎవ్వరం సరిగ్గా చదవం సహజంగా చదవకుండానే agree చేసేస్తుంటాం, అది చదివి అక్కడికి వెళ్లి ఫేసుబుక్ తో నా డాటాను షేర్ చేయొద్దు అని చెప్పాల్సి ఉంటాది అంటే disaggre అన్నమాట.
మీలో ఎంతమంది అలా వెళ్లి చదివి ఫేసుబుక్ తో నా డేటా షేర్ చేసుకోవద్దు అని మీరు ఎక్కడైనా సెట్టింగ్స్ లో చెప్పారా?
చాలామంది అలా చెయ్యం అందువల్ల అలా చేయకపోవడం ద్వారా ఎదేచ్చగా మనకు తెలియకుండానే మనకు సంబంధించిన సమాచారాన్ని వాట్స్అప్ 2016 నుంచి ఫేసుబుక్ తో డేటాని షేర్ చేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు తాజాగా వాట్సప్ తన ప్రైవసీ రూల్ ను మరోసారి మార్పు చేసినపుడు ఈసారి మార్పు చేసినప్పుడు ఏమన్నది అంటే నేను ఫేస్బుక్తో అంటే మా పేరెంట్ కంపెనీతో మేము మా డేటా ని షేర్ చేసుకుంటాం ఫేసుబుక్ తోనే కాదు ఫేసుబుక్ ను ప్లాటుఫారం గా వాడుతున్న ఇతర బిజినెస్ లతో కూడా మీ డేటా ను షేర్ చేస్తాం అని whatsApp ప్రకటించింది. so ఎప్పుడైతే వాట్సాప్ తన ప్రైవసీ రూల్స్ మార్చిందో users కి నా డేటా ని ఫేసుబుక్ తో షేర్ చేయొద్దు అని చెప్పే అవకాశం లేకుండా పోయింది. అంతకు ముందు లేదు నా డేటా ఫేసుబుక్ తో పంచుకోవద్దు అని చెప్పే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా వాట్సాప్ చేసేసింది.
కానీ ఎప్పుడు ప్రాబ్లెమ్ ఏటంటే ఫేసుబుక్ మరియు రిలయన్స్ జియో మార్ట్ కలవడం జరిగింది. so jio mart, facebook తో కలవడం వ్యాపార అవసరాల కొరకు వాడుకుంటుంది. అంటే ఇప్పుడు భారతదేశంలో వాట్సాప్ వినియోగదారులు కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరి ప్రైవేట్ డేటా వీళ్లందరి వ్యక్తిగత గోప్యతో భాగంగా ఉండాల్సిన డేటా మొత్తం ఈరోజు ముకేశ్ అంబానీ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇలా అంబానీ అనే కాదు ఫేసుబుక్ తో వ్యాపారసంబంధాలు పెట్టుకున్న అన్ని కంపెనీలకి డేటా అనేది షేర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే మన ప్రైవసీ డేటా అనగా వ్యక్తిగత గోప్యంగా ఉండాల్సిన సమాచారం తో ఫేసుబుక్ వ్యాపారం చేస్తుంది ఫేసుబుక్ తోనే కాకుండా ఫేసుబుక్ తో వ్యాపారసంబంధాలు పెట్టుకున్న అన్ని కంపెనీలకి పెద్ద ఎత్తున డేటా షేరింగ్ చేస్తాది.
వ్యతిరేకత కు కారణం :
వాస్తవంగా దీని పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్లో restrictions ఉన్నాయి అక్కడ మాత్రం వాట్సాప్ మొత్తం డేటాని facebook తో షేర్ చేసుకోవడం లేదు, మన ఇండియాలో రెగ్యులేషన్స్ వీక్ గనుక ఇండియాలో చేసుకుంటున్నామని చెబుతోంది దాంతోపాటు facebook ఇటీవల నవంబర్ లో నేషనల్ ఫ్లాగ్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు WhatsApp UPI అనే ఒక పేమెంట్ సిస్టమ్ ను కూడా అనుమతించారు అంటే ఉదాహరణకు Google Pay, Paytm పే లాగా వాట్సాప్ పే సిస్టమ్ ను కూడా అనుమతించారు. అనుమతించేటప్పుడు ఈ పేమెంట్ సిస్టమ్ రేగులటరీ అయిన పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు చాల క్లియర్ గా ఒక కండిషన్ పెట్టారు అదేంటంటే ఈ వాట్స్ అప్ డేట్ ను ఫేసుబుక్ లో షేర్ చేసుకోవద్దు అని so దాన్ని కూడా voilate చేస్తూ ఈరోజు whatsapp తన ప్రైవసీ డేటా అంశం మార్చి మేము facebook తో షేర్ చేసుకుంటాం అని చెప్పారు.
ఏమేం షేర్ చేసుకుంటాం మనము వాడుతున్న "డివైస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన లొకేషన్ షేర్ మరియు అలాగే మన మెసేజ్ లు మనం ఎవరెవరితో ఇంట్రాక్ట్ అవుతున్నాం దానికి సంబంధించిన సమాచారం ఏయే అంశాలపై మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అనే సమాచారం" వాట్సప్ అనగా ఫేస్బుక్ కి వెళ్తుంది. ఆఖరికి మనం ఏయే పేమెంట్ లు ఏయే ట్రాన్సాక్షన్ లు చేస్తున్నాం అనేది కూడా ఫేస్బుక్ కి వెళ్తుంది. ఇలా everything మన వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా వెళ్తుంది.
మన వ్యక్తిగత సమాచారంతో పనేంటి :
మన వ్యక్తిగత సమాచారం మొత్తం ఫేస్బుక్ కి వెళ్తే ఏం చేసుకుంటాంరనే డౌట్ మనకి రావచ్చు - ఎం చేసుకుంటారంటే మనకి ప్రొఫైలింగ్ చేస్తారు చేసి మనకు మైక్రో టార్గెట్ ద్వారా మనకు ADS మన ఫోన్ లో లేదా ఇతర device లలో display అవుతాయి. ఉదాహరణకు మీరు చాలా సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు అనుకోండి రోజు పూజాపునస్కారాలు చేస్తూ భగవత్గీత చదువుతూ మీరు జీవితాన్ని గడుపుతున్నారు అనుకోండి అప్పుడు మీకు ఎటువంటి అడ్వటైజ్మెంట్ లు వస్తాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను ఉపదేశించిన ఉపదేశం ఇచ్చేటువంటి అడ్వటైజ్మెంట్ లు వస్తాయి.
లేదా మీరు Pose lifestyle కలిగిన వ్యక్తి అనుకోండి మీకు ఆ రకమైన ADS అనేవి display అవుతాయి. so అంటే మిమ్మల్ని మైక్రో టాబ్లెట్ చేయడం ద్వారా సూక్షతి సూక్ష్మంగా మిమల్ని టార్గెట్ చేసి ఆ విధంగా advertisements మనకి display చేస్తారు. ఎందుకు టార్గెటింగ్ చేస్తారు అంటే వాళ్ళ Advertisements కి మరియు వ్యాపార లావాదేవీలకి, మన బిహేవియర్ అర్ధం చేసుకోవడానికి, మార్కెట్ ను స్టడీ చేయడం కోసం చేస్తారు. చివరికి రాజకీయ అభిప్రాయాలును జనాలకి కల్పించేందుకు కూడా చేసారు అందుకే facebook పైన చాలా విమర్శలు వచ్చాయి. ఫర్ ది ఫేస్ బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికల్ అనే ఇష్యూ కూడా వచ్చింది.
మన ప్రైవసీ డేటా తో బిజినెస్ :
ఒకరకం గా మన వ్యక్తిగత సమాచారాన్ని వస్తువుగా మార్చి అమ్మకాలు చేసుకోవడానికి ఈ సమాచారం కీలకం అందువల్ల డేటా అనేది అంతా ఇంపార్టెంట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా డేటా పైన డేటా ప్రైవసీ పైన చాలా ప్రాధాన్యత ఉంటుంది. భారతదేశంలో ఉన్న కోట్లాది వాట్సప్ వినియోగదారుల సమాచారాన్ని ఫేస్బుక్ కి అందజేయడం facebook ద్వారా వ్యాపారం చేస్తున్న Jiomart వంటి కొన్నికార్పొరేట్ సంస్థలకు అందజేయడం, ఫేస్బుక్ ప్లాటుఫారం ను వుపయోగించి వ్యాపారం చేస్తున్న వారికి అందజేయడం ఒకరకం గా మన సమాచారాన్ని వాళ్ళు అమ్ముకోడానికి ఇది వీలు కల్పిస్తుంది.
అందువల్లనే దేశ వ్యాప్తంగా వాట్స్అప్ పైన తీవ్ర వ్యతిరేకత ఇప్పుడే కాదు 2016 whatsApp తన ప్రైవసీ రూల్స్ ను మార్చి ఫేస్ బుక్ తో నేను నా యూజర్ డేటా పంచుకోను అని హామీ facebook కొనుగోలు సమయంలో హామీ ఇచ్చింది users కి కానీ ఆ హామీని ఉల్లంఘించింది అప్పుడే whatsApp కో ఫౌండర్ అయిన "Brian Acton" బయటకి వచ్చి ఇది అన్యాయము మనము ఫేస్బుక్ కొన్నప్పుడు ఒక హామీ ఇచ్చాము వినియోగదారులక ఈ సమాచారాన్ని నేను ఫేస్బుక్ కి ఇవ్వము అని కానీ ఇప్పుడు ఇస్తున్నారని చెప్పి వారు నిరసన తెలిపి signal foundation అనే సంస్థ పెట్టి non-profitable పేరుతో SignalApp ను ప్రమోట్ చేసారు. ఈ SignalApp లాభాల కోసం కాకుండా డొనేషన్స్ తో నడిచేలా రూపొందించారు అనగా SignalApp మనకు నచ్చితే కొంత అమౌంట్ మనమే డొనేట్ చేయడం.
ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ కారణంగా ఈ సిగ్నల్అప్, టెలిగ్రామ్ లు పెద్ద ఎత్తున డౌన్లోడ్ లు పెరిగాయి. ఇంత జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున WhatsApp ను భారీ ఎత్తున వినియోగదారులు app డిలీట్ చేయడం WhatsApp నుంచి బయటికి రావడంతో WhatsApp ఇక డామేజ్ కంట్రోల్ మెస్సుర్ ను మొదలుపెట్టింది. అలా ఏమీ ఉండదు మీరు ఇంకెవరితోనైనా మాట్లాడుకునేవి మరియు సీక్రెట్ conversations లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా మీ messages మేము చూడలేము అంటూ మీకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సెక్యూరిటీ కల్పిస్తాం అనే విధంగా WhatsApp స్టేటస్ లు రూపంలో Advertisements ద్వారా ప్రచారం స్టార్ట్ చేసింది.
ముగింపు :
actually facebook కి ఇటువంటివి కొత్త ఏమికాదు గతం లో కూడా ఫేస్బుక్ ఇట్లాంటి డ్యామేజ్ కంట్రోల్ లు, గతంలో కూడా ఫ్రీ బేసిక్స్ అని ఫేస్బుక్ ఒక పధకాన్ని పెట్టింది అప్పుడు నెట్ టు ట్రాలీ కి ఇది విరుద్ధము అని పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున వివాదం అయినా ఫ్రీ బేసిక్స్ కి వ్యతిరేకంగా నెట్ టు ట్రాలీ ఉండాలని చాలా మంది మాట్లాడారు. అప్పుడు కూడా Facebook మళ్ళి పెద్ద పెద్ద Advertisements ఇచ్చి డామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. ఇలా చాల సార్లు చూసాం, ఇప్పుడు తాజాగా వాట్సాప్ వ్యవహారంలో డేటా చౌర్యానికి పాల్పడుతున్నది అనే విమర్శలు కూడా చూసాం అందువల్ల ఈరోజు ఈ కాంట్రవర్సీ ఏంటంటే మన వ్యక్తిగత ముఖ్యంగా గోప్యంగా ఉండాల్సిన మన వ్యక్తిగత సమాచారం దీనితో ఈ బిగ్ టెక్నాలజీ జెట్ ఏరకంగా వ్యాపారం చేస్తాయి అన్నదానికి తాజా వాట్స్అప్ వివాదం ఒక ఉదాహరణ
అయితే WhatsApp చెప్తున్నా దాన్ని చాలామంది ఈ రంగంలో నిపుణులు వ్యతిరేకంగా కొట్టిపారేస్తున్నారు ఇది నిజం కాదు వాట్సాప్ కహానీలు చెప్తుంది. ఇప్పటికి వాట్సాప్ మన డేటా ని ఫేస్బుక్ లో పంచుకుంటోంది, facebook తో లింక్ ఉన్నటువంటి వ్యాపార సంస్థలతో పంచుకుంటోంది అని whatsApp చేస్తున్న claims ను కొట్టిపారేస్తున్నారు.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....