స్టార్ హీరోల సినిమాల మద్య పోటీ వస్తే?

movie-competition-beetween-tollywood-star-heros
స్టార్ హీరోల సినిమాల మద్య  పోటీ వస్తే?


హీరో ల మధ్య పోటీ గురించి మహేశ్ బాబు:

హీరోల మధ్య మరియు సినిమా మధ్య పోటీ ఉండడం అనేది సహజమే. కానీ ఆ పోటీని కూడా స్నేహపూర్వకంగా మార్చుకున్న ఘనత టాలీవుడ్ కు దక్కుతుంది. ప్రతి సంవత్సరం కూడా పండగ సీజన్ అప్పుడు స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కనీసం రెండు సినిమాలు ఒకే తేదీన పోటీపడతాయి. ఈ సందర్భంలో పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని పోటీ నివారిస్తూ, విడుదల తేదీల్లో మార్పులు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఈ సంక్రాంతికి ఈ విధంగానే జరిగింది. సరిలేరు నీకెవ్వరు, మరియు అల వైకుంఠపురములో ఈ రెండు సినిమాలు కూడా ఒకే తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ పెద్దల యొక్క జోక్యంతో ఒక రోజు తేడాతో వచ్చాయి. ఇకపోతే  ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి హిట్ సాధించాయి. దాంతో మళ్లీ పోటీ ఏర్పడింది. తొలి రోజు, రెండవ రోజు అంటూ ఇలా రోజుల వారిగా కలెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా ప్రేక్షకులను ఆకర్షించేందుకే. 


అందుకే రెండు సినిమాల కలెక్షన్లను కూడా ఒకదాని మించి మరొకటి నవ్వసాగారు వంద కోట్ల క్లబ్ లో కూడా ఇదే జరిగింది. రెండు వందల కోట్లు వచ్చాయని ఒకరంటే మాకు కూడా రెండు వందల ఇరవై కోట్లు వచ్చాయని మరొకరు ప్రచారం  చేయడం కొనసాగించారు. అయితే నిజానికి ఈ రెండు సినిమాలు కూడా మంచి సూపర్ హిట్ ను సాధించాయి. కానీ ఏదీ నెంబర్ వన్ అనే దగ్గరే సమస్య వచ్చింది. "అల వైకుంఠపురములో చిత్ర ప్రచారంలో ఇండస్ట్రీ హిట్ అని పేర్కొంటు ప్రకటన విడుదల చేశారు. ఇది అల్లు అర్జున్ సినిమా, దీంతో మహేష్ ఫ్యాన్స్ హడావుడి చేశారు. చిత్ర నిర్మాత సరిలేరు నీకెవ్వరు సినిమా ని కూడా ఇండస్ట్రీ హిట్ అని పేర్కొన్నారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ ఎలా అవుతాయి? అయితే మరి ఈ డౌట్ అందరికీ వచ్చింది. అయితే సరిలేరు నీకెవ్వరుసినిమా విషయంలో కొంత స్పష్టత ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చేర్చారు. ఇలా సమన్వయంతో వెళుతూ స్నేహపూర్వకమైన పోటీని పాటించారు.



Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....