![]() |
దోసె పిండి తో 'కట్ లెట్స్' ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి. |
దోసె పిండితో 'కట్ లెట్స్' ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి :
దోసె పిండి కట్ లెట్స్ కి కావాల్సిన పదార్ధాలు :
- దోసె పిండి - కావాల్సినంత లేదా ఒక కప్పు తీసుకోండి,
- కార్న్ ఫ్లోర్ - ఒక అర కప్పు తీసుకోండి,
- ఆలుగడ్డలు (ఉడికించినవి) - ఒకటి తీసుకోండి,
- క్యారెట్ తురుము - ఒక అర కప్పు తీసుకోండి,
- బఠాణీ (ఉడికించినవి) - అర కప్పు తీసుకోండి,
- కొత్తిమీర - ఒక అరకప్పు తీసుకోండి,
- ఉప్పు - రుచికి తగినంత తీసుకోండి,
- నూనె - సరిపడా తీసుకోండి,
- చాట్ మసాలా - ఒక టేబుల్ స్పూన్,
- మసాలా - ఒక టేబుల్ స్పూన్.
దోసె పిండి కట్ లెట్స్ తయారుచేసే విధానం :
ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు మరియు బఠాణీలను బాగా మెత్తగా చేసుకోవాలి. అందులో రెడీ గా పెట్టుకున్న క్యారెట్ తురుమును కలుపుకోవాలి. ఆ తరువాత దోసెల పిండిలో కార్న్ ఫ్లోర్ ని, మసాలా, ఉప్పు, చాట్ మసాలా మరియు కొత్తిమీరతో పాటు ఆలుగడ్డలు, బఠాణీ కూడా ముద్ద చేసి అందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న కట్ లెట్స్ గా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి, స్టవ్ పై పాన్ పెట్టి కొంచెం వేడెక్కాక అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత కట్ లెట్స్ పాన్ మీద పెట్టుకుని, అవి ఎర్రని కలర్ లోకి వచ్చేవరకు రెండువైపులా కట్ లెట్స్ తిప్పుతూ సన్నని సెగ మీద కాల్చుకోవాలి. అంతే దోసెల పిండి కట్లెట్స్ రెడీ, వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే రుచి అమోఘం.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....