ప్రావిన్స్ లో జరిగే ఐస్ ఫిషింగ్ గురించి ఆసక్తికర విషయాలు.

interesting-facts-about-ice-fishing-in-pravins-manibota
ప్రావిన్స్ లో జరిగే ఐస్ ఫిషింగ్ గురించి ఆసక్తికర విషయాలు.

ప్రావిన్స్ లో జరిగే ఐస్ ఫిషింగ్ గురించి ఆసక్తికర విషయాలు :

నీటిలో ఒక గాలన్ని వేసి సులభంగా చేపలు పట్టడం అందరికీ బాగా తెలిసిన విషయమే. కానీ ఐస్ లో గాలన్ని వేసి (ఐస్ ఫిషింగ్చేపల్ని పడతారని తెలుసా? సాధారణంగా చలికాలంలో ఈ భూమి మీద ఎక్కడైనా సరే కొన్ని నదులు మరియు చెరువులు గడ్డ కడుతుంటాయి. పై పైన ఉన్న నీళ్లు గడ్డ కట్టి కింద ఉన్న నీళ్లు మాత్రం మామూలుగానే ఉంటాయి. ఎప్పటిలాగానే అందులో ఉండే చేపలు అందులోనే తిరుగుతూ ఉంటాయి. కెనడాలో మనిబొటా ప్రావిన్స్ లో ఉష్ణోగ్రత పడిపోవడం వలన అక్కడ ఉన్న నదులు మరియు చెరువులు గడ్డ కట్టేస్తాయి. దీనితో చలికాలంలో ప్రావిన్స్ లో ఐస్ ఫిష్ హంటింగ్ మొదలవుతుంది. 

చేపలు పట్టేవాళ్లు మరియు కొంతమంది సరదా కోసం ఈ సీజన్ లో ఐస్ ఫిషింగ్ బాగా చేస్తారు. ఈ ఐస్ ఫిష్ హంటింగ్ లో ప్రత్యేకంగా ఆర్టిఫిషల్ ఐస్ ఫిషింగ్ హట్ ( ఉండటానికి ఒక చిన్న తాత్కాలిక ఇల్లు లాంటిది) ఏర్పాటుచేసుకుని మరీ అక్కడ చలిలో ఐస్ ఫిషింగ్ చేస్తారు. వాళ్ళు అక్కడే కొన్ని రోజులపాటు ఉండి చేపలు పడుతుంటారు. అక్కడ వుండే చలిని తట్టుకునే విధంగా వాళ్ళు సూట్స్ వెస్కొని వెళ్లి ఐస్ డ్రిల్ అనేది చేస్తారు. 

ఆ ఐస్ డ్రిల్ ఒక చిన్న బావిలా మారుతుంది. ఆ బావిలోకి ఎరను పెట్టి గాలన్ని వేస్తారు. గాలనికి ఉన్న ఎరను తినడానికి వచ్చిన చేపలు వాళ్ళ గాలానికి చిక్కుకుపోతుంది. ఈ ఐస్ ఫిష్లను వాళ్ళు లోకల్ గా ఉండే మార్కెట్లో మంచి ధరకి అమ్ముతుంటారు. తిరిగి మళ్లీ ఎండాకాలం నదులు మరియు చెరువులు పూర్వ స్థితికి చేరుకుంటాయి. అయితే, కేవలం ఈ ఐస్ ఫిషింగ్ కెనడాలో మాత్రమే కాదు ప్రపంచంలోనే అనేక చోట్ల ఇలా చాలాకాలం లో గడ్డ కట్టే చాలా ప్రాంతాల్లో ఈ ఐస్ ఫిషింగ్ ను చేస్తుంటారు.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....