గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు ... ఈ విధంగా చెక్ చేసుకోండి?

how-to-check-apsachivalayam-results-release
గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు ... ఈ విధంగా చెక్ చేసుకోండి? 

గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు ఈ విధంగా చెక్ చేసుకోండి: 

ఏపీలో గ్రామ మరియు అలాగే వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1st నుండి 8th వరకు ఆరు రోజులు పాటు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. సెప్టెంబరు 19th లేదా 20th తేదీల్లో ఈ ఫలితాలను వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే OMR షీట్స్ స్కానింగ్ పూర్తయింది.. మంగళవారం Sep 17th న తుది పరిశీలన కూడా చేసేసారు. అధికారులు అభ్యర్థుల యొక్క OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియను నాగార్జున యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఈ స్కానింగ్ కోసం ఏకంగా 350 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేశారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో స్కానింగ్ ప్రక్రియను మొత్తం పూర్తిచేశారు. 

19 లక్షలకు పైగా OMR షీట్లను స్కానింగ్ చేశారు. తుది పరిశీలన తరువాత సెప్టెంబరు 20వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు. గ్రామ  మరియు వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి ఇక అందరికి తెలిసిన విషయమే. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. కాని 19.74 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. 

Also Read : విగ్రహాల ధ్వంసం పై ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్

అలాగే పిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ 1902 కాల్‌సెంటర్‌ నెంబరును ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సమస్యలు కానీ ఫిర్యాదులు కానీ ఉంటే నేరుగా ఈ నెంబరుకే ఫోన్ చేసి స్వయంగా పరిస్కారించుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2 nd న వారి విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ. 15 వేల జీతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు.  వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి DDO గా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.


1 Comments

Hello, buddy if you have any doubt feel free to comment.....

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....