హిందూ మహాసముద్రంలో కొత్త నీలి తిమింగలాల జాతి.

new-spicies-of-bue-whales-discovered-in-indian-ocean
 హిందూ మహాసముద్రంలో కొత్త నీలి తిమింగలాల జాతి.

హిందూ మహాసముద్రంలో కొత్త నీలి తిమింగలాల జాతి :

పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్రంలోని మరొక కొత్త రకపు నీలి తిమింగలాలని (Blue Whales) గుర్తించినట్లుగా పరిశోధకులు చెప్తున్నారు. పశ్చిమ మహాసముద్ర ప్రాంతాల్లోని వచ్చిన ధ్వని తరంగ రికార్డింగ్ ల విశ్లేషణ ఆధారంగా సైంటిస్ట్ లు వీటిని గుర్తించడం జరిగింది. ఈ నీలి తిమింగలాలు భూమిపైన ఇప్పటివరకూ నివసించిన అతిపెద్ద సముద్ర జంతువులుగా వీటిని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అత్యంత ప్రమాదకర స్థితిలో ఉండే ఈ సముద్ర క్షీరదాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా అన్ని మహాసముద్రాల్లోను కనిపిస్తాయన్నారు. ఈ నీలి తిమింగలాల సంఖ్య చాలా తక్కువ అని చెప్తున్నారు, ఇవి ఒక రకమైన భయంకర సౌండ్ చేస్తాయని, ప్రతి నీలి తిమింగలం కూడా ఒక ప్రత్యేకమైన శబ్దం చేస్తాయి అని అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ అక్వేరియానికి సంభందించిన పరిశోధకులు అంటున్నారు.

ఈ నీలి తిమింగలాల జాతి అంతరించిపోతున్నట్లుగా కొన్నిరోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో సైంటిస్ట్ లు ఒమన్ మరియు అరేబియా మహాసముద్రం మరియు దక్షిణ మడగాస్కర్ లో ఈ నీలి తిమింగలాల జాతి ధ్వని తరంగాలను విశ్లేషించారు. అయితే  పశ్చిమ హిందూ మహాసముద్రంలోని ఉన్న ధ్వని తరంగాలకి మిగతా ప్రాంతాల్లోని ధ్వని తరంగాలకి ఉన్న తేడాను గుర్తించినట్లు "న్యూ ఇంగ్లాండ్ అక్వేరియం" సైంటిస్ట్ 'సాల్వడోర్ సెర్చియో' చెప్పారు. అయితే ఈ నీలి తిమింగలాలలు గతంలో శ్రీలంకలోని గుర్తించిన ఒక సంతతికి చెంది ఉండవచ్చని వారు భావిస్తున్నారు.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....