మన జీవన విధానాన్ని ఈ విధంగా మార్చుకోవడం వల్లే పర్యావరణంలో మార్పు వస్తుంది.

how-to-control-environment-polution
మన జీవన విధానాన్ని ఈ విధంగా మార్చుకోవడం వల్లే పర్యావరణంలో మార్పు వస్తుంది.

పర్యావరణం లో చేయాల్సిన మార్పులు :

పర్యావరణంలో మార్పులు అనేవి ఎప్పటికప్పుడు రోజు రోజుకు చాలా అధికం అవుతున్నాయి. జీవనవిధానంలో మార్పులు, అడవుల నరికివేత, బహుళ అంతస్తుల నిర్మాణం మరియు ప్లాస్టిక్ విచ్చలవిడి వాడకం వంటి అనేక కారణాలు వాతావరణ సమతుల్యతను చాలా వరకు దెబ్బతీస్తున్నాయి. నవంబరులో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఉండాలి. అయితే ఆ తరువాత నెమ్మదిగా వేసవికాలంలోకి అడుగు పెడతాం. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జనవరి నెల రెండోవారం నుంచి వాతావరణంలో క్రమంగా మార్పు ప్రారంభమైంది. క్రమంగా నెలాఖరు వచ్చేసరికి వాతావరణ ఉష్ణోగ్రతల్లో అధిక మార్పు కనిపించడం ప్రారంభించింది. అయితే ఇక ఇది రాబోయే సీజన్లకు ఒక హెచ్చరిక అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జనవరి నెల 15వ తేదీ నుంచే వాతావరణంలో మార్పులు అనేవి ప్రారంభమయ్యాయి. 

Also Read : జూపార్కులో ఎప్పుడూ చూడని వింత! ఆశ్చర్యానికి గురి చేసిన సింహం! ఏమి జరిగిందో తెలుసా?

రాత్రివేళల్లో చలి గణనీయంగా తగ్గిపోయింది. గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చినట్లు వాతావరణ శాఖ నిపునులు స్పష్టంచేసింది. రెండు నుంచి మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరిగింది. ఒక మధ్యాహ్నం వేళల్లో సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే నాలుగు నుంచి 5 డిగ్రీల వరకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక రకంగా వేసవికాలాన్ని తలపించేలా శీతాకాలం మారిపోయింది. అయితే దీనికి ముఖ్య కారణం జీవనవిధానంలో మార్పుల వల్లే నని పర్యావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా చెప్పాలి అంటే వాతావరణానికి సంబంధించి నాలుగు నుంచి ఐదు దిక్కుల నుంచి గాలులు వీస్తున్నాయి అప్పుడు దీనికి అనుగుణంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తూర్పు ఆగ్నేయ ఖాతం నుంచి రాష్ట్రంలోకి తరచూ తేమగాలులు వీస్తున్నాయి. అయితే దాని ప్రభావం వల్ల ఆకాశం మావృతం ఉంటోంది. ఈ కారణంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి.

శీతలగాలులు భూమికి చేరకుండా మేఘాలు అడ్డుకుంటున్నాయి. అయితే హిమాలయ రాష్ట్రంలో డిసెంబరు నుంచే విపరీతంగా మంచు కురుస్తున్నా ఇటువైపు శీతలగాలులు వంటివి రాకపోవడానికి బంగాళాఖాతం అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలులే కారణమని వాతావరణ పరిశోధకులు చెప్పారు. నగరాలు విస్తరించడం అలాగే అడవి ప్రాంతం క్రమేపీ తగ్గిపోతూ ఉండటం వల్ల వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటోంది. ఒక పక్క వర్షాలు అనేవి చాలా వరకు తగ్గిపోవడం మరియు శీతల గాలులు వంటివి కూడా వీచకపోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

శీతాకాలంలో చలిగాలులు వీయకపోవడం వల్ల అనేక రకాల పంట దిగుడిలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఆశించిన అంత పంట చేతికి అందడం లేదు దీంతో డిమాండకు సరిపడా ఆహార ఉత్పత్తులు కూడా అందుబాటులోకి రావడం లేదు. శీతాకాలంలో కూడా వేడి గాలుల వల్ల ఇప్పటికే 15 నుంచి 20 శాతం పంట దిగుబడి తగ్గిపోయింది. వాతావరణంలో మరింత మార్పులు వస్తే దిగుబడి శాతం గణనీయంగా పడిపోయే ఆవశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. చెరువులు మరియు గుంతలును ఆక్రమించుకుని నగరాలును విస్తరించడం అలాగే ఒక పక్క చెట్లు నాటకపోవడం వంటి చర్యలు వాతావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రధానంగా అటవీ విస్తీర్ణ ప్రాంతం ప్రతియేటా తగ్గుతూ వస్తోంది అంటే అడవులను నరికేస్తున్నారు. గ్రామాలు మరియు పట్టణాలు, నగరాల్లో ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. 

హరితహారం పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం మాత్రం ఎక్కడా కూడా కనిపించడంలేదు. చెట్లను నాటే సమయంలో చూపించే శ్రద్ధ వాటికి నీరుపోసి పోషించడం, పెంచడంలో మాత్రం అస్సలు చూపించడం లేదు. దీనికి నిధులు కేటాయించక పోవడంతో కొన్ని రోజులకే నాటిన మొక్కలు చాలా వరకు చనిపోతున్నాయి. అయితే మళ్ళీ దీనికితోడు ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకూ మరీ విపరీతం గా పెరుగుతోంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో అయితే ప్లాస్టిక్ ను నిషేధించినా సరే అది కొన్ని రోజులకే పరిమితం అవుతోంది. ఎక్కడ చూసినా కూడా వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, సీసాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

అయితే ఇవి కొన్ని వందల సంవత్సరాల వరకు భూమిలో కలువకపోవడం వల్ల పర్యావరణం లో మార్పు వస్తుంది. వీటిని తిన్న పశువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నగరాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్నాయి. అలాగే వర్షాలు వచ్చినప్పుడు కూడా నీరు భూమిలోకి ఇంకిపోయే అవకాశం లేకుండా పోయింది. దీంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఇలా ఒకదానితో మరొకటికలిసి పర్యావరణాన్ని బాగా విపరీతంగా దెబ్బతీస్తూన్నాయి. గత పదేళ్లుగా పరిశీలిస్తే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇక ఈ ప్రభావం రాబోయే వేసవి మరియు వర్షాకాలంపై స్పష్టంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుడే పర్యావరణం లో మార్పులు కనిపించాయి.

సకాలంలో వర్షాలు కురవకపోగా నవంబర్ లో తుపానులు వచ్చాయి. దీనివల్ల పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గి విపణిలో ధరలు ఆకాశాన్ని అంటాయి. జూన్, జూలై, ఆగస్టు నెల ల్లో వర్షాలు కురిస్తే పంట దిగుబడి బాగా ఉంటుంది. అలాగే రైతులకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా గత సంవత్సరం ఆగస్టు మొదటివారం వరకు వేసవి కొనసాగింది. పంటచేలు అన్నీ కూడా బీడు భూములుగా మారిపోయాయి. 

సీజన్ ముగిసిన తరువాత భారీవర్షాలు కురిసాయి. దీంతో చేతికి వచ్చిన పంట కాస్తా చేజారిపోయింది. అయితే ప్రస్తుతం శీతా కాలంలో మార్పులు గమనిస్తే రాబోయే రుతువులు మరింత భిన్నమై, ప్రతికూలతలను చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. రాబోయే తరానికి మనం ఏమిస్తున్నాం అని ఒకప్పుడు అనేవారు. ప్రస్తుతం నేటి తరానికే ముప్పువాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారని పర్యావరణ వేత్తలు బాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు జీవనవిధానాన్ని మార్చుకుని ప్రకృతికి సహకరించే రీతిలో వ్యవహరించాలని నిపుణులు కోరుతున్నారు. ఇకనైనా మొక్కలు నాటడానికి, అవి పెరగడానికి తగిన కృషి చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదే సమయంలో వృక్షాలను ఇష్టా రాజ్యంగా నరికివేసే విధానానికి కూడా ఇకపై స్వస్తి పలకాలి. చెట్లను నరక కుండా నిరోధించే చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన కూడాఉంది.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....