మన నోటిలో ఉన్న క్రిములు పోయేలా ఎలా శుభ్రం చేసుకోవాలి ?

how-to-clean-mouth-to-get-rid-of-germs
మన నోటిలో ఉన్న క్రిములు పోయేలా ఎలా శుభ్రం చేసుకోవాలి ?

మన నోటిలో ఉన్న క్రిములు పోయేలా ఎలా శుభ్రం చేసుకోవాలి ? :

మానవుని నోటిలో దాదాపు గా 500 రకాల జాతుల క్రిములు లేదా సూక్ష్మజీవులు నివసించడం జరుగుతుంది. ఇలా నోటిలో ఉండే హానికరిగించే బ్యాక్టీరియా, క్రిములు యొక్క స్థాయి బాగా పెరిగినప్పుడు మనకి చిగుళ్లు వాపు మరియు దంత క్షయం, దంత ఫలకం వంటి దంత సంబంధ రోగాలు అనేవి ఎదుర్కొంటాము. ఈ రోజులలో చాలా మందికి పళ్ళు దుర్వాసన రావడం లేదా పసుపు గా మారడం, పళ్ళచిగుళ్ళు నుండి బ్రష్ చేస్తున్నప్పుడు రక్తస్రావం రావడం మరియు దంత క్షయంతోనో చాలా బాధపడుతున్నారు. సరిగ్గా లేని నోటి దంతాల సంరక్షణ మాత్రమే కాకుండా, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. 

మన నోటిలో ఉన్న క్రిములు పోవడానికి మరియు మన నోటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల బ్రష్ లను మరియు టూత్ పేస్టులను బయట దుకాణాల్లో అమ్ముతున్నప్పటికీ, అందులో కొన్ని రకాల టూత్ పేస్టులు అయితే పూర్తిగా రసాయనాలతోనే నిండి ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు మన దంతాలకు హానికరం మరియు చాలా హానిని కలిగిస్తాయి. కానీ మన పూర్వీకుల కాలంలో ప్రతిదీ టూత్ పేస్ట్ లు కాదు. మన పూర్వికులు అయితే వేప పుల్లనో లేదా కలబందనో పళ్ళు శుభ్రం చేసుకోవడానికి వాడేవారు. వీటిలో ఉండే కొన్ని ఔషధ పదార్థాలు మన నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడతాయి. 

ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మూలికలు మనకు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, మన ఇంటి కిచెన్లోనే మన నోటి ఆరోగ్యాన్ని రక్షించే కొన్ని ఔషధ ఉత్పత్తులు అనేవి ఉన్నాయి. మనం ప్రతిరోజూ వాటిని జాగ్రత్తగా చూసుకున్నట్లైతే, అవి ఖచ్చితంగా మన నోటిలోని బ్యాక్టీరియాను, క్రిములను  పూర్తిగా నాశనం చేస్తుంది. మన నోటి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది. అయితే ఇప్పుడు ఇంట్లోనే కిచెన్ లో ఉన్న ఉత్పత్తులు తో మౌత్ వాష్ ని ఎలా తయారు చేసుకోవాలో మరియు నోట్లోని ఉన్న బ్యాక్టీరియాని, క్రిములను  చంపడానికి ఆ మౌత్ వాష్ ఎలా వాడాలో చూద్దాం.

మౌత్ వాష్ తయారుచేసే విధానం :

ఒక చిన్నపాటి గిన్నెలో అర స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు లో గోరువెచ్చగా కొన్ని నీటిని తీసుకొని అందులో ఏదైనా టూత్ పేస్ట్ ని 3 నిమిషాలు పాటు నానబెట్టండి తర్వాత టూత్ బ్రష్ ను ఉపయోగించి ముందుగా తీసుకుని పెట్టుకున్న సాల్ట్ మరియు సోడాను బాగా కలపండి, ఆ మిశ్రమం ను మీ పళ్ళకు బాగా రుద్దండి. తర్వాత ఒక కప్పు గోరువెచ్చ ని నీటిలో కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ [H2O2] ను కలపాలి. తర్వాత ఆ నీటిని మీ నోటిలో పోసి ఒక నిమిషం పాటు బాగా గార్గిలింగ్ చేసి అనగా పుక్కిలించి బయటకి ఉమ్మివేయండి. 

తరువాత టూత్ పిక్ తో పళ్ళ యొక్క వెనక భాగంలో పట్టేసిన ఫలకాన్ని బాగా మెత్తగా రుద్దండి. తర్వాత చల్లని వాటర్ తో నోటిని బాగా శుభ్రం చేసుకోండి. మీ నోటితో ఎలాంటి ప్రాబ్లెమ్ రాకూడదు అని అనుకుంటే, ప్రతిరోజు మార్నింగ్ ఆయిల్ పుల్లింగ్ అనేది చేయడం అలవాటుగా చేసుకుంటే మంచిది. అలా డైలీ 2 సార్లు పళ్ళును శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒక్కసారి తప్పకుండా చేస్తే మీ పళ్ళు మరియు నోరు అనేది చాలా శుభ్రంగా ఉంటాయి.



Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....