పాలకూర పూరీలు ఎలా తయారుచేయాలో తెలుసా?

crispy-crispy-palak-puris-making-in-telugu
crispy-crispy-palak-puris-making-in-telugu
పాలకూర పూరీలు ఎలా తయారుచేయాలో తెలుసా?

పాలకూర పూరీలు :

పాలకూర పూరీలు చేయడానికి కావలసిన పదార్థాలు :

  1. పాలకూర - ఒక 6 కట్టలు,
  2. గోధుమపిండి - ఒక 50 గ్రాములు,
  3. జీలకర్ర - 5 గ్రాములు తీసుకోండి,
  4. ఉప్పు - రుచికి తగినంత,
  5. నూనె - పూరీలు వేయించుకోవడానికి తగినంత.

పాలకూర పూరీలని తయారుచేసే విధానం :

ముందుగా పాలకూర కట్టల్ని ఉడికించుకోవాలి. తర్వాత బయటకి తీసి బాగా చల్లార్చుకోవాలి, అవి చల్లారిన తర్వాత గుజ్జులా బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న గోధుమపిండిలో ఈ పాలకూర గుజ్జు మరియు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు ను మరియు నీళ్లు వేసుకుని ముద్దగా కలుపుకోవాలి. ఈ ముద్దని మనం పూరీలు చేసుకునేటట్టుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. 

తర్వాత స్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని మరిగిన తర్వాత పూరీలు వేయించుకోవాలి. పాలకూర పూరీలు చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయంలో స్నాక్ గా తీసుకుంటే బాగుంటాయి. ఈ పాలకూర పూరీలని ఆలూ కూర్మాతో గానీ, చట్నీతో గానీ తింటే అదిరిపోతాయి.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....