టోర్నడో, హరికేన్, సైక్లోన్ ఈ మూడు ఒకటేనా? |
టోర్నడో, హరికేన్, సైక్లోన్ ఈ 3 పదాలు కూడా తుఫానుకి సూచికలనే చెప్పాలి. ఒక్కోసారి సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం (low pressure area) వల్ల పెనుగాలులు అనేవి వృత్తాకారంలో విపరీతమైన వేగంతో చెలరేగుతాయి. అయితే ఈ పెనుగాలుల తీవ్రత మరియు పరిమితి ప్రదేశాన్ని బట్టి వీటికి ఈ విధంగా నామకరణం చేసారు. ఈ భూగోళపు ఉత్తరార్ధగోళంలో అపసవ్య అనగా Anticlockwise దిశలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతాలని మరియు అలాగే దక్షిణార్ధగోళంలో సవ్య అనగా clockwise దిశలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతాలని “సౌక్లోన్స్” అని అంటారు. ఈ అల్పపీడన ప్రదేశాలు అనేవి వృత్తాకారంలోగాని లేక అండాకారంలోగాని హిందూ మహా సముద్రంలోని ఎక్కువగా ఏర్పడతాయి.
ఉష్ణమండల ప్రదేశాల్లో అంటే Tropical areas లో ఎక్కువగా కొన్నిగంటల కొద్దీ భయంకరంగా వీచేటువంటి గాలుల్ని “హరికేన్” అని అంటారు. వీటివల్ల వర్షాలు అనేవి పడవు. పెనుగాలులు మాత్రం భీభత్సముగా వీస్తాయి. వెస్ట్ ఇండీస్, కరీబియన్ ప్రాంతాలలో ఈ హరికేన్లు చాలా ఎక్కువగా వస్తాయి. టోర్నడో లు అలాకాదు చాలా చిన్న చిన్న ప్రదేశాల్లో ఏర్పడే భయంకరమైన తుఫాన్ గాలులు, వీటివల్ల పిడుగులతో పాటు పెనుగాలులు వీచి వర్షాలు అనేవి పడతాయి. ఈ రకం టోర్నడో లు అమెరికాలోని Mississippi లో బాగా ఎక్కువగా వీస్తాయి. మిసిసిపి బేసిన్లో ఈ టోర్నడోలు సర్వసాధారణం అనే చెప్పాలి. ఇవి అతి భయంకరమైన టోర్నడోలు.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....