కుళ్ళిన మాంసం గుర్తించే ఎలక్ట్రానిక్ ముక్కు.

electronic-nose-to-detects-rotten-meat-food
కుళ్ళిన మాంసం గుర్తించే ఎలక్ట్రానిక్ ముక్కు.

కుళ్ళిన మాంసం గుర్తించే ఎలక్ట్రానిక్ ముక్కు :

ఎలక్ట్రానిక్ ముక్కు: మనం సాధారణం గా మటన్, చికెన్ మరియు చేపలు వంటివి కొనేందుకు మార్కెట్ కి వెళ్తాము అనుకోండి. అ ఐటమ్స్ ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని తెలిసేదెలా?

మనం వాటి వాసన చూడటం ద్వారా కొంతవరకు తెలుసుకోవచ్చు. అయితే అలా అన్ని సార్లు ఈ విధంగా వాసన చూడటం కుదరకపోవచ్చు. మరెలా తెలుసుకోవాలి?

అయితే ఇటువంటి ఇబ్బందిని తొలగించటానికి "నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ సైంటిస్టులు" ఎలక్ట్రానిక్ ముక్కు కనిపెట్టటం జరిగింది. పూర్తిగా కృత్రిమ మేధ పరిజ్ఞానంతో చేసిన ఈ ఎలక్ట్రానిక్ ముక్కు సేమ్ మనిషి ముక్కులాగే పనిచేస్తుంది అని అన్నారు. మాంసాహారాల తాజాదనాన్ని ఈ ఎలక్ట్రానిక్ ముక్కు 95% చాలా నాణ్యంగా గుర్తించగలదు. మాములుగా మన ముక్కు యొక్క పైన భాగంలో అన్ని రకాల వాసనలను పసిగట్టే ఒక వ్యవస్థ ఉంటుంది. మనం వాసనా చూసే పదార్ధాల నుండి వచ్చే వాయువులు మొదటిగా ఈ వ్యవస్థ వద్దకే చేరుకుంటాయి. వాసనని పసిగట్టగలిగే గ్రహకాలు ముందుగా వీటిని గుర్తించి, ఆ సంకేతాలను నేరుగా మెదడుకి చేరవేస్తాయి. అలా చేరవేసిన వాసనలను మెదడు విశ్లేషన జరిపి ఫ్రెష్ గా ఉన్నాయా? లేక పాడైపోయాయా? అనేది విషయాన్నీ నిర్ణయిస్తుంది.

ఈ ఎలక్ట్రానిక్ ముక్కు ఈ పద్ధతి లోనే పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ ముక్కు లో 2 పార్ట్లుంటాయి. ఫస్ట్ పార్ట్ బార్ కోడ్. ఈ బార్ కోడ్ గీతలు వాసనలను గుర్తించే గ్రహాకాలుగా పనిచేస్తాయి. మాంసాహారం కుళ్లిపోతున్న కొద్దీ వాటినుంచి వచ్చే వాయువులను బట్టి ఈ బార్ కోడ్ రంగు అనేది మారుతుంది. సెకండ్ పార్ట్ బార్ కోడ్ రీడర్ ఉంటుంది ఇది స్మార్ట్ ఫోన్ యాప్ లా ఉంటుంది ఇది బార్ కోడ్ లో మారే కలర్స్ ను బట్టి మాంసాహారం ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని తెలియజేయడం కోసం ఉపయోగపడుతుంది.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....