ఎక్కువ సేపు కూర్చోవడం ఎంత ప్రమాదమో తెలుసా? |
ఎక్కువ సేపు కూర్చోవడం ఎంత ప్రమాదమో తెలుసా? :
ఆఫీస్ లో హాయిగా ఛైర్ లో కూర్చుని చేసే జాబ్ అయితే ఎంతో బాగుంటుంది అని ఒకప్పుడు అనుకునేవారు, కానీ ప్రస్తుతం వున్నా పరిస్థితుల వల్ల కూర్చుని చేసే జాబ్స్ ఉద్యోగుల పట్ల శాపంగా మారుతున్నాయి. అందుకే అలాంటి జాబ్స్ ఇష్టం లేకుండా చేస్తూ అనేక రకాల రోగాలకు గురవుతూ బతుకుజీవుడా అంటూ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ప్రస్తుత ప్రపంచలో ఎక్కువగా సంభవిస్తున్న మరణాల్లో 4 వ వంతు మరణాలకి అసలు కారణం ఆఫీస్ లో కూర్చుని చేసేపనుల వల్లేనట. సాధారణంగా రోజంతా ఒకేచోట కూర్చుని ఉండేవారికి తొందరగా గుండెజబ్బులు వస్తాయట. మధుమేహం వంటి వ్యాధులు కూడా తొందరగా వస్తాయట. మనిషి యొక్క కండరాలు మరియు కీళ్లు బిగుసుకుపోయి, రక్తప్రసరణ మందగించటం వంటివి చాలా తేలిగ్గా వస్తున్నాయట. ఇవన్నీ కేవలం ప్రతిరోజు యోగా, వ్యాయామం లాంటివి చేయకపోవడం వల్ల ప్రతి ఏడాది సుమారుగా 32 లక్షల మంది మరణిస్తున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయం.అందులో సుమారుగా 21% రొమ్ము, పేగు క్యాన్సర్లు, 27% మధుమేహం వ్యాధి, 30% హృదయ సంబంధ రోగ మరణాలుగా కనిపెట్టారు.
విచిత్రం ఏంటంటే ఒక గంట కూర్చోవటం వల్ల 22 నిమిషాల లైఫ్ చేతులారా కరిగిపోతుందని డాక్టర్స్ చెప్తున్నారు. క్యాన్సర్ వ్యాధి కారకాల్లో పొగత్రాగటం తర్వాత ఎక్కువసేపు కూర్చోవడమన్నది ఆస్ట్రేలియాకి చెందిన నిపుణుల పరిశీలన, అందుకే ఎక్కువసేపు కూర్చోవడం పొగత్రాగటంతో సమానం అని అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ముందుగా వచ్చేది శరీర పరిమాణం పెరుగుదల, ఎందుకంటే మన జీవక్రియ యొక్క పనితీరు వేగం అనేది కాస్తా నెమ్మదిస్తుంది. దాని కారణంగా శరీరంలో క్యాలరీలు ఖర్చు తగ్గుతుంది.
శరీరంలో కొవ్వును కరిగించే Lipoprotein lipase అనే Extracellular Enzyme పనితీరు 90% తగ్గిపోతుంది. అంటే శరీరంలో కొవ్వుల్ని డైజెస్ట్ చేసే శక్తి తగ్గిపోయి దాని ఫలితంగానే ఊబకాయం వస్తుంది. మనం కదలకుండా ఒక 20 మినిట్స్ కూర్చున్నా సరే డైజీషన్ సిస్టం వేగం తగ్గుతుంది. 4 గంటలు కదలకుండా కూర్చుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ యొక్క పెరుగుద నియంత్రించే Enzyme విడుదల అనేది దాదాపు ఆగిపోతుంది. మనం కదలకుండా ఒక 10 గంటల పైనే కూర్చోవడం వల్ల బాడీ లో Insulin స్రావం 40% తగ్గిపోతుంది. మధుమేహం వ్యాధి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉన్నా అనువంశికంగా (వంశం లో తర తరలుగా వస్తున్న మార్పు) వచ్చే ఛాన్స్ లేకున్నా కూడా కొందరిలో మధుమేహం వ్యాధి రావడానికి ముఖ్య కారణం కదలకుండా కూర్చోవటమే.
3 గంటల వ్యవధిలో కదలకుండా కూర్చున్నా సరే Blood Circulation వేగం అనేది తగ్గిపోతుంది. 2 వారాల పాటు రోజుకి 6 గంటల కన్నా ఎక్కువ సమయం కూర్చుంటే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దాని ఫలితంగా హృదయానికి రక్తాన్నిసరఫరా చేసే నాళాల్లో కాలక్రమేణా పూడికలు అనేవి ఏర్పడతాయి. గుండె సంకోచవ్యాకోచ వేగంలోనూ కూడా మార్పు వస్తుంది. దీంతో బ్లడ్ ప్రెషర్(BP) పెరిగి ఏ క్షణంలోనైనా గుండె పట్టేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే మానవ శరీరం యొక్క అమరిక ఎలా ఉంటుందంటే, ఎక్కువ సమయం కూర్చుని ఉండటానికి అనుకూలం కాదు. దీనితో ఎక్కువ సమయం నిటారుగా కూర్చోలేక గోడకు ఆనుకునో లేక ముందుకు వంగిపోయో కూర్చుంటారు. ఈవిధంగా కూర్చోవటం వల్ల పొట్టలో కండరాలు చాలా బలహీనంగా మారతాయి. మెడ మరియు భుజాల కండరాలు(Muscles) బిగుసుకుపోతాయి. మొత్తంగా Muscles లో సాగే గుణం అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్లలో Spine(Backbone) సమస్యలూ, Arthritis వస్తాయి.
అదేపనిగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ళ కండరాలు కూడా రాను రాను మొద్దుబారతాయి, ఈ విధంగా 20వ శతాబ్దం చివరలో, అనగా ఈ కంప్యూటర్ కాలం లో కూర్చుని చేసే పనులే ఎక్కువ. ఈ కంప్యూటర్ లు లేని కాలం లో ఎవరూ ఇలా కూర్చోలేదా అని అంటే ఇంతలా ఎక్కువసేపు కూర్చోలేదనే చెప్పాలి. కొన్ని వేల ఏళ్లుగా మనిషి ఒకే చోట ఎప్పుడూ కూడా గట్టిగా 2 గంటలైనా విశ్రాంతిగా కూర్చోలేదనే చెప్పాలి. నిద్రలేచిన దగ్గర నుంచి, మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకూ ఏదో పనిచేస్తూనే ఉండేవాడు. ఆడవారు కూడా ఇంట్లో ఇంటిపని లేదా వంటపని గాని పిల్లల చూసుకోవడం, పెద్దవాళ్లను చూడటం వంటి పనులు చేసేవారు. ఇక ఆ కాలం లో పిల్లలు గురించి చెప్పక్కర్లేదు పిల్లలు అయితే దాగుడుమూతలు అని "కోతి కొమ్మచ్చి, తొక్కుడుబిళ్ళ, కర్రాబిళ్లా" వంటివి ఆడుకునేవారు ఇక స్కూల్లో అయితే గంటగంటకీ టీచర్స్ తరగతి గదికి వచ్చినప్పుడల్లా లేచి Good Morning చెప్పడం, మార్నింగ్ ప్లెడ్జ్, ప్రతిరోజు వ్యాయామాలు, యోగాలు చేస్తూ స్థిరంగా ఒకేచోట కూర్చోవడమంటూ ఉండేదికాదు.
ఎక్కువ సేపు కూర్చోవడం ఎంత ప్రమాదమో తెలుసా? |
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఉద్యోగాలు చేసేవారు లేదా వ్యాపారాలు చేసేవారు ఎవరైనా సరే రోజంతా కూర్చుని వర్క్ చేసేవారు ఎవరైనా సరే ప్రతి గంటకి ఒకసారి మీరు కూర్చున్న కుర్చీలోంచి పైకి లేచి 5 నిమిషాలు పాటు అటూ ఇటూ వడవండి. ఇది వ్యాయామం కంటే కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మొత్తానికి కూర్చోవడానికి విరుగుడు మళ్ళి నిలబడటమే. అందువల్ల రోజుకి 2 గంటలు పాటు కూర్చోవడం తగ్గించి, నిలబడటానికి కొంచం ప్రయత్నించండి. కొలెస్ట్రాల్ మరియు మధుమేహం వ్యాధి ఎంత కంట్రోల్లో ఉంటాయో మీకే తెలుస్తుంది. మధ్య వయసులో ఉన్నవాళ్ళు, అధిక శరీర బరువు ఉన్నవారు ప్రతి 20 నిమిషాలకి 2 నిమిషాలు నిల్చుంటే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిల్చోవడానికి బదులు లేచినడిస్తే మరింత ఎక్కువ ప్రయోజనకరంగా చెప్పొచ్చు ఎందుకంటే నడుము చుట్టుకొలత తగ్గుతుంది. నిలబడటం వల్ల హార్ట్ నిమిషానికి 10 సార్లు అదనంగా కొట్టుకుంటుంది. అందువల్ల గంటకి 20 క్యాలరీలు శరీరంలో అదనంగా కరుగుతాయి.
అందువల్ల రోజుకీ 5 నిమిషాలు నిల్చోవటం లేదా కాసేపు లేచి నడవటం, లేచినప్పుడు మన రెండు చేతుల్నీ పైకి ఎత్తి శరీరాన్ని రెండువైపులా విల్లులా విరవటం వల్ల ఒక నెలకి సుమారుగా 2500 క్యాలరీలు బర్న్ అవుతాయి. దీన్నిబట్టి మనం కూర్చోవడానికి బదులుగా ఎక్కువ నడవటం వల్ల ఎంతో మంచిది అని చెప్పొచ్చు. ఆఫీస్ లలో లిఫ్టు కి బదులుగా మెట్లు వాడటం, ఆఫీస్ లలో సైకిల్ లేన్లు పెట్టడం, లంచ్ బ్రేక్ సమయంలో ఉద్యోగులు అందరూ కాసేపు నడవటానికి వీలు కల్పించడం లేదా సహుద్యోగులతో వర్క్ పరమైన విషయాలు గురించి చర్చించడం లేక వాళ్ళతో ఫోనులో మాట్లాడటం కంటే డైరెక్ట్ గా వెళ్లి కలిసి మాట్లాడటం చాలా వరకూ నడుస్తూ మాట్లాడగలిగేలా సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కూర్చునే అలవాటు క్రమ క్రమంగా తగ్గుతుంది. మంచి ఆరోగ్యవంతులుగు మారడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటె "ఆరోగ్యమే మహా భాగ్యం" కాబట్టి.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....