నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా మారడానికి ఇవి పాటిస్తే చాలు. |
నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా మారడానికి ఇవి పాటిస్తే చాలు :
సాధారణంగా అందరికీ ఒక కోరికుంటుంది తెల్లగా ఉండాలి అని లేదా ఎర్రగా ఉంటే బాగుండు నల్లగా అసలు ఉండకూడదు మన స్కిన్ అంతా కూడా మంచిగా తెలుగు రంగులోకి వస్తే బావున్ను అని తల తల మెరిసిపోవాలి అని అనుకుంటాం.
Science :
మాములుగా ఈ చర్మం తెలుపు రంగు లేదా ఎరుపు రంగు అనేది మన వారసత్వంగా వచ్చే లక్షణాలు ను బట్టి "జీన్స్" ను బట్టి ఉంటుంది మన ఫ్యామిలీ లో అందరూ తెల్లగా ఉంటే మనం తెల్లగా పుడతాం లేదా నల్లగా ఉంటే నల్లగా పుడతాం ఈ విధంగా జీన్స్ బట్టి రంగు అనేది వస్తుంది. కానీ కొంతమందికి నల్లగా ఉన్న వారికి కూడా వారు తెలుపు అయితే బావుండేది అని కోరుకుంటారు. అసలు చర్మం నలుపు రంగులోకి ఎందుకు వస్తుంది అంటే ఏ ప్రాంతాల్లో అయితే ఎండలు ఎక్కువ వుంటాయో, ఎండలో ఎవరైతే ఎక్కువగా తిరుగుతుంటారో ఆ ఎండ యొక్క కిరణాలు చర్మం మీద పడినప్పుడు మన చర్మం లోపల ఉండే మెలనోసైట్స్ అంటారు. మెలనోసైట్స్ ఎండ ఎక్కువ పడేటప్పుడు ఎండ నుంచి రక్షించడానికి మెలనోసైట్స్ పిగ్మెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి, ఆ మెలనోసైట్స్ పిగ్మెంట్ అనేది నలుపు రంగులో ఉంటుంది. అందువల్ల ఎండ తగిలేకొద్దీ మన చర్మం అనేది నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది లోపల ఆ మెలనోసైట్లు అనేవి మెలనిన్ ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి. అందుకే ఎవరైతే ఎండలో ఎక్కువ పనులు చేసుకునే వాళ్ళు వుంటారో వాళ్ళు అందరూ నల్లగా ఉంటారు, ఎవరైతే ఏసీలు లో నీడపట్టున ఎండ తగలకుండా కూర్చుంటున్నారో వాళ్లలో ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ తక్కువ తయారవుతుంది అందుకని ఎంత మెలనిన్ తగ్గితే వాళ్ళ చర్మం అంత తెలుపు లేదా ఎరుపు గా మారుతూ ఉంటుంది.
అందుకని ఎండ తగలని దేశాల వాళ్ళందరూ తెల్లగా ఉంటారు వాళ్ళ జుట్టు కూడా తెల్లగా ఉంటుంది. ఎండ బాగా ఎక్కువ వుండే దేశాల్లో తెలుపు తక్కువ ఉండి కాస్త నలుపు ఎక్కువగా ఉండి ఒక చామంచాయి లో కానీ లేదా ఒక మాదిరి రంగులో ఉంటారు. కొంతమందిలో తెలుపు పెరగాలని కోరుకుంటారు వాళ్ళకి పెళ్లి సంబంధాలు కొంచం నల్లగా ఉండే సరికి ఇబ్బంది అవుతాయి చామంచాయి లో వుండే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతాయి. మనము విత్తనాన్ని మార్చలేము కానీ కొంచెం నలుపు రంగు తగ్గాలి చామంచాయి తగ్గి కొంచం తెలుపు గానీ ఎరుపు గానీ వస్తే బాగుండాలని కోరుకుంటారు కదా! అలాంటి వాళ్ళలో కొంతమంది ఏదైనా అది రాయండి ఇది రాయండి ఈ సోప్ వాడండి తెల్లగా వస్తారు అని టీవీలో చూపిస్తుంటారు. ఇంకా రకరకాల బొమ్మలు పెట్టి ఈ వారం ఇంత పెరిగింది ఈ వారం ఇంత పెరిగింది అని చూపిస్తారు కానీ అవన్నీ నాకు తెలిసి పెద్ద ఎక్కువ మార్పు మీకు తీసుకురావు అని ఖచ్చితంగా చెప్తా.
నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా మారడానికి ఇవి పాటిస్తే చాలు. |
చేయాల్సినవి :
సరే మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి కానీ కొంచం నలుపు రంగు తగ్గాలి అంటే తెలుపు పెరగాలంటే వున్నది ఒకటే సొల్యూషన్ మీరు ఎండ తగలకుండా చూసుకోండి అసలు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు మంచి సలహా కూడా కాదు కానీ మీరు అసలు ఎండ పడకుండా జాగ్రత్తపడండి కలర్ మీకు ఎరుపు అవుతూ వస్తుంది.
మనం ఒక పది రోజులు ఆలా రోజు ఇంట్లో ఉండకుండా ఎండలోకి వెళ్లి వస్తే మనం రంగు లో నుండి 50% కలర్ తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు A.C లో ఉంటే ఖచ్చితంగా మరల మన రంగు అనేది మళ్ళీ పొందవచ్చు.
అందుకని ఎక్కడైతే ఏసీ గదుల్లో ఉంటున్నారో ఎక్కడైతే ఎండ తగలకుండా ఉంటున్నారో వాళ్లందరికీచర్మం లోపల వుండే మెలనోసైట్లు అనేవి స్టిములేట్ కావు మెలనిన్ స్టిములేట్ హార్మోన్ అనేది వీళ్ళలో తక్కువ తయారవుతుంది. ఎండ తగిలితే ఈమెలనిన్ స్టిములేటింగ్ హార్మోన్ (MSH) అనేది ఎక్కువ విడుదల అవుతుంది ఎండకి, అది ఎంత ఎక్కువ విడుదల అయితే లోపలంతా ఎక్కువ నలుపు రంగు ఉత్పత్తి చేసే మెలనిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అందుకని స్కిన్ కలర్ తగ్గిపోతూ ఉంటుంది.
చర్మం రంగులో నలుపు కొంచం తగ్గాలి ఎరుపు లోకి రావాలి అంటే అలాంటివారికి ఈ MSH అనే హార్మోన్ విడుదల తగ్గాలి అంటే ఎండ తగలక పోతే అది తగ్గిపోతుంది అందుకని అది తగ్గేకొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గి నెలలు గడిచే కొద్ది మీలో ఆ కలర్ కొంచం నలుపు తగ్గడం అనేది జరుగుతుంది. అంచేత మీకు ఈ ఒక్కటే కొంచం ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది. ఇంకొక్కటీ మీరు చూసినట్లయితే చల్లగా ఉండే దేశాలకి వెళ్లి చూడండి ఉదాహరణకి అమెరికా గానీ కెనడా గానీ వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు కలర్ చూస్తే అందరూ తెలుపు రంగులోనే ఉంటారు. అలాగే మనవాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కలర్ మార్పు అనేది ఉంటుంది. అదే ప్రయత్నం మనం ఇక్కడ ఉండి కూడా చేయాలి అంటే సాధ్యమైనంత AC ఉండటం, ఎండ తగలకుండా ఉండటం, నీడ పట్టున ఉండటం వల్ల ఈ MSH తగ్గి మన కలర్ నలుపు తగ్గి ఎరుపు రంగు లోకి మారి చర్మం మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది.
ఈ విధంగా చేస్తూ ప్రతిరోజు రెండు juices అనేవి తాగడం వల్ల బావుంటుంది అందులోను విటమిన్ C, A లు ఉంటే చర్మం అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది. అలాగే మంచి నీళ్లు కూడా రోజుకు నాలుగు లేదా అయిదు రెట్లు ఎక్కువగా తాగటానికి ప్రయత్నం చేయండి దీని వల్ల స్కిన్ చాల healthy గా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ C వుండే juices అంటే కమలపళ్లు కానీ బత్తాయి కానీ సాయంత్రం టైం లో తీసుకుంటే చాల మేలు అనేది చేస్తుంది. అలాగే డిన్నర్ ఎప్పుడు కూడా Nuts లేదా ఫ్రూప్ట్స్ వంటివి తినడం మంచివి ఇంకా మార్నింగ్ టైం వెజిటబుల్ రసం తీసుకోండి అంటే కార్రోట్ లేదా బిత్రోట్ వంటి juices తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఇవన్నీచేయడం ద్వారా కచ్చితంగా మంచి రంగు అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....