కొబ్బరి రైస్ తో ఇలా కేక్ చేసి చుడండి మళ్ళీ వదలరు.

making-delicious-coconut-rice-cake
కొబ్బరి రైస్ తో ఇలా కేక్ చేసి చుడండి మళ్ళీ వదలరు.

కొబ్బరి రైస్ తో ఇలా కేక్ చేసి చుడండి మళ్ళీ వదలరు :

కొబ్బరి రైస్ కేక్ చేయడానికి కావలసినవి:

  1. కొబ్బరి తురుము - ఒక కప్పు,
  2. కొబ్బరి పాలు - ఒక పావు లీటర్, 
  3. పంచదార - ఒకటిన్నర కప్పు,
  4. బియ్యం - రెండు కప్పులు ( బియ్యం 4 గంటలు వరకు నానబెట్టాలి),
  5. నెయ్యి - 1 లేదా 2 స్పూన్లు, 
  6. వాటర్ - 2 కప్పులు.

కొబ్బరి రైస్ కేక్ తయారీ విధానం :

కొబ్బరి రైస్ చేయడానికి ముందుగానే నానపెట్టుకున్న బియ్యంలో 2 కప్పుల వాటర్ ని వేసుకుని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ను ఆన్ చేసుకోవాలి, ఆ పాత్రలో పంచదార మరియు కొబ్బరిపాలు వేసుకోవాలి, పంచదారని కరిగేవరకూ బాగా తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలుపుకోవాలి. 

తర్వాత  మిశ్రమంలో కొబ్బరి తురుమును వేసుకుని మరోక సారి బాగా కలుపుకోవాలి. అనంతరం కేక్ తయారుచేసుకునే గిన్నెకు అడుగు భాగం లో నెయ్యి రాసుకుని అందులో ఈ మిశ్రమంను వేసుకోవాలి తర్వాత మైక్రో ఓవెన్లో పెట్టి 180° వేడిలో బేక్ చేసుకోవాలి. ఒక 45 నిమిషాల బేక్ చేసుకుంటే కొబ్బరి రైస్ కేక్ రెడీ అయిపోతుంది.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....