![]() |
అన్నం తో ఓ సారి ఇలా కేక్ చేసి చుడండి అస్సలు వదలరు. |
అన్నం తో ఓ సారి ఇలా కేక్ చేసి చుడండి అస్సలు వదలరు :
అన్నం కేక్ చేయడానికి కావాల్సినవి పదార్ధాలు :
- అన్నం - ఒక కప్పు,
- పంచదార - ఒక కప్పు,
- కోడి గుడ్డు - ఒకటి,
- పాలు -ఒక అర కప్పు,
- మైదా పిండి - ఒక కప్పు,
- వంట నూనె - ఒక టేబుల్ స్పూన్,
- బేకింగ్ సోడా - ఒక అర టేబుల్ స్పూన్,
- బేకింగ్ సోడా - ఒక అర టేబుల్ స్పూన్,
- వెనిలా ఎసెన్స్ - కొద్దిగా తీసుకోండి.
అన్నం కేక్ తయారీ విధానం :
అన్నం మరియు పంచదార ఒక మిక్సీ జార్ లో వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమం లో ముందుకు పక్కుకు తీసుకున్న గుడ్డు మరియు మైదా, పాలు, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ లని వేసుకుని మరోకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మొత్తం మైదా రాసిన కేక్ గిన్నెలో వేసుకోవాలి, తరువాత స్టవ్ వెలిగించి దానిపై కుక్కర్ ని పెట్టుకుని అందులో స్టాండ్ ని పెట్టుకోవాలి. తర్వాత దీనిపై ఈ కేక్ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్ లో 40-50 నిమిషాలు పాటు ఉంచుకోవాలి. కేక్ మంచిగా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం చాకును గుచ్చి ఒకసారి చూడాలి. చాకుకు గనక కేక్ అట్టుకున్నట్లైతే మరోక 5 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోనికి కేక్ ని తీసుకుని మీకు నచ్చినట్లుగా అందంగా డెకరేట్ చేసుకోవాలి.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....