బఠాణీ దాల్ కూరని ఈవిధంగా చేస్తే భలే రుచి వస్తుంది.

making-spicy-green-peas-dal-curry-in-telugu
బఠాణీ దాల్ కూరని ఈవిధంగా చేస్తే భలే రుచి వస్తుంది.

బఠాణీ దాల్ కూరని ఈవిధంగా చేస్తే భలే రుచి వస్తుంది :

బఠాణీ దాల్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు : 

  1. పచ్చి బఠానీలు - 2 కప్పులు,
  2. పచ్చి శెనగపప్పు - 1/4 కప్పు,
  3. కొత్తిమీర తరుగు - 4 స్పూన్ల,
  4. పచ్చి మిర్చి - నాలుగు కాయలు,
  5. కొబ్బరి తురుము - ఒక పావు కప్పు,
  6. నూనె - 100 గ్రాములు,
  7. నిమ్మరసం - 2 స్పూన్లు,
  8. ఆవాలు - 2 స్పూన్లు,
  9. అల్లం - 2 ముక్కలు,
  10. ఉసిరికాయ పొడి - 1/4 స్పూను,
  11. పంచదార - 1 స్పూను,
  12. కారం - 1 స్పూను.

బఠాణీ దాల్ తయారు చేసే విధానం :

ముందుగా తీసుకున్న శనగపప్పు శుభ్రంగా కడుక్కోవాలి, తర్వాత పచ్చి బఠానీలని మరియు ఉప్పుని కలుపుకుని తగినంత వాటర్ వేసుకుని ఉడికించాలి. అనంతరం అల్లం మరియు మిర్చీలను మిక్సీలో పేస్టులా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచం ఆయిల్ వేసుకోవాలి, తర్వాత కాగిన ఆయిల్ లో ఆవాలని వేసి వేయించుకోవాలి తర్వాత అల్లం ముక్కలు మరియు మిర్చీలు పేస్టును వేసుకోవాలి ఓ నిమిషం దాన్ని వేపుకోవాలి. ఇలా వేపుకున్న పేస్టుకు ముందుగా ఉడికించిన పప్పు ను (వాటర్ వంపేసి) తర్వాత పంచదార ఉసిరికాయ పొడి మరియు కొబ్బరి తురుముని వేసుకుని 2 నిమిషాలు అలా వేపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గట్టి పడిన తర్వాత నిమ్మరసాన్ని కొత్తిమీర కలుపుకుని దించుకోవాలి. ఈ బఠాణీ దాల్ కర్రీ చపాతీ తో మరియు రోటీల్లోకి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....