![]() |
సైలెంట్ గా సైడ్ అయిపోయిన అనుష్క శర్మ |
సైలెంట్ గా సైడ్ అయిపోయిన అనుష్క శర్మ :
ఈ ముచ్చట అనుష్క శర్మ గురించే! విరాట్ ని పెళ్ళి చేసుకోగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుష్క ముందు భావించిందట! కానీ తన నిర్ణయం వల్ల అభిమానులు నిరాశకు గురవుతారని భావించిందట! నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ తెర వెనుకకు వెళ్ళాలని డిసైడ్ అయిందట! తన నిర్ణయాన్ని బహిర్గతం చేయకుండా ఏ సినిమాకు ఓకే చెప్పకుండా కాలం వెళ్ళదీస్తోంది.
Also Read : ఒడిస్సి తో ఒళ్ళు తగ్గించుకున్న హీరోయిన్...?
గతంలో ఒకేసారి మూడు నాలుగు సినిమాకు ఓకే చెప్పిన అనుష్క ఇప్పుడు ఏడాది కాలంగా ఒక్కటంటే ఒక్క సినిమాకు ఓకే చెప్పలేదు. కారణం మంచి కథ దొరకలేదట! ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో మంచి మంచి సినిమాలు పదుల సంఖ్యలోనే వచ్చాయి. మంచి విజయం సాధించాయి. అలాంటివి అనుష్క కంట పడలేదా? లేదా పడినా లైట్ తీసుకుంటోందా? అన్నదే అభిమానుల సందేహం. ప్రస్తుతం సినిమా కన్నా భర్తతో కలిసి మ్యాచ్ లకు వెళ్ళడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందట! మొత్తానికి అనుష్క సైలెంట్ గా సైడ్ అయ్యిందన్న మాట బాలీవుడ్లో బాగా వినిపిస్తోంది.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....