ఒడిస్సి తో ఒళ్ళు తగ్గించుకున్న హీరోయిన్...?

the-heroine-got-weight-loss-with-oddessey
ఒడిస్సి తో ఒళ్ళు తగ్గించుకున్న హీరోయిన్...?

ఒడిస్సి తో ఒళ్ళు తగ్గించుకున్న హీరోయిన్ : 

సినిమాల్లోకి రాకముందు ఆహార వ్యాయామాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు సారా. ఎప్పుడైతే సినిమాల్లో అడుగుపెట్టిందో ఆమె తన తీరు మార్చుకుంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన ఆమె సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫిట్నెస్ రహస్యాల గురించి ఇలా చెబుతోంది సారా. రోజూ ఒకే రకమైన వ్యాయామాలు చేయడం వల్ల ఫలితం ఉండదు. అందుకే నేను వ్యాయామాలను కలిపి లేదా మార్చి అనుసరిస్తూ ఉంటాను. పిలేట్స్ నుంచి స్ట్రింగ్ ట్రైనింగ్ వరకూ బూట్ క్యాంప్ వర్కవుట్స్, కార్డియో ఇలా వేర్వేరు వ్యాయామాలకు ఫిట్ నెస్ లో స్థానం కల్పిస్తుంటాను. 

Also Read :  సీనియర్ నటి అనుష్క కి అంత తొందర ఎందుకో ? 

మొదట్లో అవసరానికి మించి బరువు ఉండేదాని కాబట్టి చురుగ్గా వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరించేది కాదు. అందుకే ఎక్కువగా వాకింగ్, సైక్లింగ్ చేసి బరువు తగ్గించుకున్నాను. ఆ తర్వాత పిలేట్స్ వ్యాయామం కోసం 'నమ్రతా పురోహిత్' అనే టైగర్ ను నియమించుకున్నాను.ఈ వ్యాయామం కండరాల ఫ్లెక్సిబిలిటీ పెంచింది, నేనెంతో ఇష్టపడి నేర్చుకున్న ఒడిస్సీ నృత్యం నా అధిక బరువు తగ్గించుకోవడానికి తోడ్పడింది.  సిండీ జోర్డాన్ దగ్గర బూట్ క్యాంప్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడింది. దీనిలో ఫుల్ బాడీ వర్కవుట్స్ స్ట్రెంగ్త్ టైనింగ్ కూడా ఉంటాయి. ఏరోబిక్స్ చేసిన ఫలితం కూడా దక్కుతుంది.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....