![]() |
మళ్ళీ చాలా కాలం తరవాత మోహన్ బాబు , చిరంజీవి కలిసి సినిమా? |
మళ్ళీ చాలా కాలం తరవాత మోహన్ బాబు , చిరంజీవి కలిసి సినిమా :
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటివల ఈ సినిమాలో ఒక పాటతో షూటింగ్ ను ప్రారంబించారు. చిరంజీవి మరియు త్రిషలపై ఈ పాటను చిత్రీకరించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయి అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఈ చిత్రం కోసం చిరంజీవి గారు చాలా వరకు బరువు తగ్గారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ హీరో మోహన్ బాబు గారు ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రపై ఈ సినిమా యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చింది.
Also Read : విజయ్ ఈ పరిస్థతి లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు?
ఈ సినిమాలో మోహన్ బాబు గారు నటిస్తున్నారు అని వార్తలు ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఆయనకు తగ్గ క్యారెక్టర్ మా సినిమాలో లేదని చెప్పారు. ఒకవేళ ఆయనకు తగ్గ పాత్ర ఏదైన ఉంటే ఆయనను తప్పకుండా సంప్రదించే వాళ్లం అంటూ మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే చిరంజీవి గారు మోహన్ బాబు విషయానికొస్తే... అప్పట్లో వీరి ఇద్దరూ ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్ గా కలిసి నటించారు.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....