రెండవ పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చిన అమలాపాల్!!

amalapaul-clearing-clarity-about-her-second-marriage
రెండవ పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చిన అమలాపాల్!!

అమలాపాల్

అమలాపాల్ అంటేనే ఒక సంచలనం అన్నంతగా ముద్ర వేసుకుంది ఆమె. ఎంత త్వరగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే అంతే వేగంగా ఆమె జీవితంలో కూడా చాలా పెను మార్పులును చోటు చేసుకున్నాయి. ఇక ఈమె కెరీర్ మొదట్లో ప్రేమ, పెళ్ళి అంటూ కొంచెం తొందర పడింది. తను చేసిన పనికి తీరిగ్గా బాధపడి వివాహ బంధం నుంచి విముక్తురాలైంది. ఇక అప్పటి నుండి కూడా వివాదాలు ఆమె నేస్తాలయ్యాయి. ఎన్ని వివాదాలు వచ్చినా అలాగే తనని ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా బెదరకుండా కెరీర్లో ముందుకు దూసుకుపోతున్న అమలాపాల్ తో.. 

వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టున్నారు? 

హిందీలో మహేష్ భట్. జియో సూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీన్ బాబీ అనే పాత్రలో నటిస్తున్నాను. ఇక ఈ కథ విషయానికి వస్తే 1870 నాటిది. నాతో పాటు ఈ వెబ్ సిరీస్ లో తాహిర్ రాజ్ బాసిన్, అమిత్రాపూరీ పుష్ప దీక్ష భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. ఎప్పటికైనా సరే బాలీవుడ్ లో నటించాలి అన్న నా కల తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీని గురించి నేను ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.

మీ విడాకులకు హీరో ధనుష్ కరణమని వస్తున్న వార్తలు లో నిజమెంత ?

దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగిన నటు ఇప్పుడు నా విడాకుల గురించి మాట్లాడుకోవడం ఎందుకు అది నా పర్సనల్. విడాకులు అనుకున్న నిర్ణయం పూర్తిగా నాదే. దానికి ఎవరినీ బాద్యులు చేయను. 

Also Read : త్రిష చేస్తున్న పని వల్ల అందరినీ కంగారికి గురి చేస్తుంది. అది ఏంటో తెలుసా? 

ఇంతకన్నా ఎక్కువ కుంటారా? 

ఒక్క మాటలో చెప్పాలంటే ధనుష్ గారు నా వెల్విషర్ అంతే ఇక ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడాలి అనుకోవడం లేదు.నేను చేసిన 'ఆమె' సినిమా కి అవార్డు రాలేనందుకు బాధ ఉంది మనసుపెట్టి చేసిన సినిమాకి అవార్డు రాలేదంటే బాధగా ఉంటుంది. కానీ సినిమాలో నా నటనను ప్రేక్షకులు అలాగే విమర్శకులు మెచ్చుకున్నారు. నాకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు. వాళ్లు అందరూ అలా అనుకోవడమే నాకు పెద్ద అవార్డు. అయితే అవార్డుల కోసం సినిమాలు చేసే అలాంటి అలవాటు నాకు ఏమి లేదు. నా సినిమాలకు అవార్డులు వచ్చినా రాకపోయినా సరే అవి ప్రేక్షకులకు నచ్చితే నాకు అంతే చాలు నాకు అదే ఆనందం. ఇప్పుడు ప్రస్తుతం  మీరు సినిమా 'అదో అంద పరవై పోల' గురించి ఓ అమ్మాయి కారడవిలో ఒంటరిగా చిక్కుకుంటే అక్కడి నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చాలా సహజంగా ఉంటుంది.

ఈ సినిమా హిమాలయాలకు వెళ్ళారట కదా నిజమేనా?

మూడు సంవత్సరాల క్రితమే నేను హిమాలయాలకు ట్రెక్కింగ్ కి వెళ్ళాను. అక్కడ మీటింగ్ జర పాలని ముందు యూనిట్ అనుకున్నా ఆ  తరువాత అడవిలో జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే నేను హిమాలయాలకు వెళ్ళడానికి ఈ సినిమాకు మద్య ఎటువంటి సంబంధమూ లేదు. ఈ సినిమా కోసం ముఖ్యంగా నేను ప్రత్యేకమైన శిక్షణను తీసుకున్నాను. ఇందులో మూడు పోరాట సన్నివేశాలు ఉన్నాయి. అయితే వీటి కోసం నేను కొంత ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రతి మనిషిలోనూ కూడా ఎంతో కొంత పోరాడే గుణం ఉంటుంది. ఆ విషయానికి వస్తే అది నాలో కూడా ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో నాకు అది అర్థమైంది. కాకపోతే అది అందరిలోనూ ప్రతీ సారీ బయటపడదు.ఆ సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది.

మణిరత్నం సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం? 

అన్ని పాత్రలూ అందరూ చేయలేరు. మణిరత్నం గారి సినిమాలో నా పాత్రకి నేను న్యాయం చేయలేనని అనిపించింది. ఆ పాత్ర నాకు సెట్ అవదు అనిపించి చేయలేదు. నాకు నచ్చని పాత్ర చేసి విమర్శలపాలు కావడంకన్నా దాని నుండి ముందుగానే తప్పుకోవడం మంచిదనిపించింది. మణిరత్నంగారి తరువాతి సినిమాలో నాకు అవకాశ మొస్తే తప్పకుండా చేస్తాను.

మీరొక వ్యక్తి ని ప్రేమించానని చెప్పారు కదా? పెళ్ళెప్పుడు?

దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. అవి పూర్తి అయ్యాక పెళ్ళి గురించి చెబుతాను. నా ప్రేమ గురించి చెప్పాను కదా అలాగే పెళ్లి గురించి కూడా త్వరలోనే చెప్తాను. తెలుగు సినిమాలో నటించబోతున్నారు దాని గురించి నేను ఇప్పుడు ఏమి చెప్పలేను.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....