ఇకపై నీళ్లలో నానపెడితే చాలు అన్నం రెడీ : మ్యాజిక్ రైస్ |
ఇకపై నీళ్లలో నానపెడితే చాలు అన్నం రెడీ : మ్యాజిక్ రైస్
శ్రీకాంత్ :
ఇది ఒక మ్యాజిక్ రైస్ పేరుకు తగ్గట్టుగానే నిజంగా మ్యాజిక్ రైస్ ఇది నీళ్లలో నానపెడితే త్వరగా అరగంటలో రైస్ రెడీ అయిపోతుంది స్టవ్ అవసరం లేదు ఉడికించాల్సిన పని లేదు కేవలం బియ్యం లో నీళ్ళు పోసి పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు అన్నం రెడీ. ఈ రైస్ చాల అద్భుతం గా పనిచేస్తుంది, దీన్ని ఆహారంగా తీసుకున్న తర్వాత కూడా చేసే పని కూడా అలానే ఉంటుంది దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అరగటం లేట్ గా అరుగుతుంది కావాల్సినటువంటి జీర్ణశక్తిని కూడా మనకి ఇస్తుంది.
- ప్రకృతి వ్యవసాయం పై మక్కువ పెంచుకున్న కరీంనగర్ జిల్లా శ్రీరాముల పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఈ మ్యాజిక్ రైస్ ను సాగుచేస్తున్నారు. శ్రీకాంత్ ది మొదటినుంచి కూడా వ్యవసాయ కుటుంబమే, అందువల్ల అయన చిన్ననాటి నుంచి సాగుపై దృష్టిపెట్టారు. మొదట్లో రసాయన ఎరువుల సాయంతో వ్యవసాయం చేసారు కానీ తర్వాత ప్రకృతి వ్యవసాయం పై దృష్టి పెట్టారు. సుమారు తొమ్మిది రాష్ట్రాల్లో తిరిగి దాదాపు 120 రకాల వరి వంగడాలు తీసుకొచ్చారు. ఇప్పుడు పూర్తిగా సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు.
శ్రీకాంత్ :
కావలసినంత పెట్టుబడి సమయానికి అందకపోవడం అలాగే కావలసినంత నీరు కూడా అందకపోవడం ఇలాంటి సందర్భాల్లో నేను ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో నాకు సుభాష్ పాలేకర్ గారు ఒక రేడియో లో తన ప్రోగ్రామ్ విని నేను ఈరోజు ఇంత వ్యవసాయం చేయడానికి ఇది ఒక కారణం అయ్యింది.
ఇకపై నీళ్లలో నానపెడితే చాలు అన్నం రెడీ : మ్యాజిక్ రైస్ |
- తాజాగా అస్సాం నుంచి శ్రీకాంత్ తీసుకొచ్చిన బొకాసాలనే రకం బియ్యం అందర్నీ ఆకర్షిస్తోంది. పంట సాగు సమయం జూన్ నుంచి డిసెంబర్ కాగా 145 రోజుల్లో పంట చేతికి వస్తోంది బొకాసాల్ బియ్యాన్ని కేవలం నీళ్లలో నాన పెడితే చాలు అన్నం తయారైపోతుంది చల్లటి నీళ్ళలో వేస్తే చల్లని అన్నం వేడి నీళ్లలో వేస్తే వేడి అన్నం సిద్ధం. బియ్యం లో సరిపడ నీళ్లు వేస్తే అరగంటలో అన్నంగా మారుతోంది. ఈ బియ్యం లో 10.73 శాతం ఫైబర్ 6.8 శాతం ప్రోటీన్లు ఉంటాయి అని "గౌహతి యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్" వంటి పరిశోధన సంస్థలు వెల్లడించాయి.
శ్రీకాంత్ :
అంటే ప్రతి సంవత్సరం నాకు ఒక రకం బియ్యం తీసుకురావడం నాకు ఒక అలవాటుగా మారిపోయింది ఈ క్రమంలోనే నేను ఈ సంవత్సరం అస్సాం నుంచి మ్యాజిక్ రైస్ తీసుకురావడం జరిగింది దీనియొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని రెండు కలిపి ఒక అరగంట సమయం నానబెడితే మనకు అన్నం రెడీ అయిపోతుంది, కావున ఇటువంటి వెరైటీ మన దేశంలో అంతరించి పోతున్న దేశీయ వంగడాల్లో ఇది రకం ఇది అస్సాం లో పండుతుంది, అస్సాం లో ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా పండుతుంది. ఇది ఆర్మీ వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఈ మ్యాజిక్ రైస్ అనేది మనం కర్రీస్ లేకుండా తినగలిగేటి ముఖ్యమైన వరిధాన్యం ఇది,
- ఈ వంగడం గురించి కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం జరిగింది, ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని అధికారులు అన్నారు. అయితే ఈ కొత్త వంగడం కేవలం నీళ్లలో నానపెడితేనేఅన్నంగా మారుతున్నప్పటికీ అది మన జీర్ణ వ్యవస్థ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ శాఖ అధికారి :
Digestibility అనేది మనం స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలం లో మన దగ్గర ఒక రైతు అస్సాం నుంచి ఒక రైస్ తీసుకొచ్చి పండించడం జరుగుతుంది, అది కేవలం ఉడికించకుండా నీళ్లలో నానపెడితేనే అన్నం గా తయారవడం జరుగుతుంది. కావున అవి తినొచ్చు అంతా ఓకే కానీ తర్వాత మన డైజెస్టిబిలిటీ అంటే మన మారుతున్న పరిస్థితులు దృష్ట్యా శారీరక శ్రమ అనేది తగ్గింది జనాలకి ఇప్పుడు దాదాపు చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అవి తిని వాటిని అరిగించుకోగలమా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.
- పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో శ్రీకాంత్ చేస్తున్న వ్యవసాయం పై ఎంతో మంది ఆసక్తి చూపి ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి విత్తనాలు తీసుకెళ్తున్నారు.
వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన వ్యక్తి :
దగ్గర దగ్గర 22 రకాల వంగడాలు చూపించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు అంటే షుగర్, బిపి వంటివి వస్తున్నాయి, మన వెనకటి అనగా పురాతన వంగడాలు చాలానే చూపించారు ఆరోగ్యపరంగా కూడా బీపీ, షుగర్ రాకుండా బాగుంటాయి అని విన్నాము చాలా మంది దగ్గర సేకరించి కొందరు వ్యవసాయం చేస్తున్నారు "ప్రకృతి వ్యవసాయం గోవు ఆధారిత వ్యవసాయం" చేస్తున్నారు మేము కూడా ఈ రకమైన వ్యవసాయం చేద్దామని కొన్ని కలెక్షన్ తీసుకు పోదామని రావడం జరిగింది.
- సుమారు 120 రకాల వరి వంగడాలా విత్తనాలుశ్రీకాంత్ గారి దగ్గర అందుబాటులో వున్నాయి అని శ్రీకాంత్ చెప్పడం జరిగింది.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....