
విగ్రహాల ధ్వంసం పై ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్
ఏపీ సీఎం జగన్ :

ఈరోజు కాలాలు మారాయి సైబర్ నేరాలు వచ్చాయి సోషల్ మీడియా పేరుతో యధేశ్చగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈ రోజు ఉన్నాం. వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి యుగం మారింది ఈరోజు దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేని పరిస్థితికి వ్యవస్థ దిగజారి పోయింది రాజకీయాల కోసం చివరికి దేవుడి ని సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుడి ని సైతం రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అని ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్ లోని ఈరోజు వున్నాం. ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలు తో ఈరోజు చెలగాటమాడుతున్న పరిస్థితి లు గమనిస్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అస్సలు మనుషులేనా అని చెప్పి, నిజంగా దేవుడు అంటే భయము భక్తి దేవుడంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని టైం లో ఓ చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగ్గొట్టి తర్వాత రోజు సోషల్ మీడియాలోనూ ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించి నాయకులూ అక్కడకు వెళ్లి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీల్లో దాన్ని అని పెద్దపెద్ద అక్షరాలతో చూపించడం.
నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తా ఉన్నది అని ఒకసారి మనం అంతా కూడా ఆలోచించుకోవాల్సి వుంది, ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ ని కూడా డీల్ చేయాల్సిన పరిస్థితికి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్ లు కూడా మారాలి మన efficiency మన టెక్నాలజీ కూడా ఆ దిశగా అడుగులు వెయ్యాలి.
![]() |
| apcm-jagan-press-meet-on-Destruction-of-gods-statue |
నిజంగా దేవుని విగ్రహాలను పగులకొడితే ఎవరికి లాభం ఆలయాలలో, ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసం దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరిని టార్గెట్ చేసి ఈ దుర్మార్గాలు అన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి.
ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏరకంగా దానికి ప్రచారం రాకూడదు ఆ మంచికి ప్రచారం జరగకూడదు అనిచెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలు కూడా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తా ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది.
Also Read : గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు ... ఈ విధంగా చెక్ చేసుకోండి?
2019లో నవంబర్ 14 న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలు లో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభించాం పేద పిల్లల కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి 2019 లో నవంబర్ 14 న ఈ కార్యక్రమాన్ని మనం initiate చేస్తే గుంటూరు లో దుర్గ గుడి ధ్వంసం అని చెప్పి రచ్చ చేశారు తీరా చూస్తే అది పచ్చి అబద్ధం గుడి రోడ్డుకి అడ్డంగా ఉందని వేరేచోట గుడిని నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే ఇక్కడ రోడ్డు widening చేసాం కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేసారు.
![]() |
| విగ్రహాల ధ్వంసం పై ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్ |
21 జనవరి 2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15 న దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులకు అండగా 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం.
11 ఫిబ్రవరి 2020 రోంబిచెర్లలో వేణుగోపాలస్వామి గుడి విగ్రహాలు ధ్వంసం అలాగే 13 ఫిబ్రవరి 2020 నఉండ్రాజవరం మండలం లో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు 14 ఫిబ్రవరి 2020 న నెల్లూరు జిల్లాలోకొండ్రబిట్టు కుటం లోప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం ధగ్ధం చేసారు దానికి సరిగ్గా వారం రోజులు ముందు ఫిబ్రవరి 8న ఆడపిల్లలు రక్షణకై రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించాం ఆ దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసం తో డైవర్ట్ చేసే కార్యక్రమం, ఏ పని తో మహిళా లోకమంతా కూడా ఈ దిశ చట్టం ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళాలోకానికి అని అంటే ఆ కార్యక్రమం జరుగుతే మహిళా అనుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుంది అని రాకుండా చేసే ప్రయత్నం, అదే సమయం లో వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి. అమ్మవారి గుడి ముఖ ద్వారం ధ్వంసం అయిపోయింది, నెల్లూరులో రధం కాలిపోయింది, ఒక దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలు జరిగాయి.
2020 సెప్టెంబర్ 7న 55,607 అంగన్వాడీల్లో 31 ఒక లక్ష 16 వేల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా తల్లీబిడ్డ వికాసం కోసం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనగా ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 6వ తేదీ 2020లో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం చేసారు. 2020 సెప్టెంబర్ 11న 87 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా వైస్సార్ ఆసరా కార్యక్రమాన్ని రాష్ట్ర పొదుపు సంఘాల చెల్లెమ్మలకు 6,700 కోట్ల రూపాయలను నేరుగా వాళ్ళ telic బెనిఫిట్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వాళ్లకు మేలు చేసే కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న పేద మహిళలు అందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వాళ్ల ముఖాల్లో కనిపిస్తోంది దానికి కరెక్ట్ గా సరిగ్గా రెండు రోజులకు 13 సెప్టెంబర్ 2020 న విజయవాడలో దుర్గ గుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయం చేశారు.
రైతుల పొలాలకుజలసిరులు అందించేందుకు రైతన్నల పొలంలో బోరు వేయడానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తూ వైయస్సార్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27,28 మొదలు పెడుతున్నాను అని చెప్పి సరిగ్గా రెండు రోజుల ముందు సెప్టెంబర్ 25న నెల్లూరు జిల్లాలో నాయుడుపేట లో మున్సిపాలిటీ లో తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, అక్టోబర్ 8న విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తూ జగనన్న విద్యా కార్యక్రమం ప్రారంభించి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మన సిద్ధమయ్యాం కరెక్ట్ గా మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంశం రచన అక్టోబర్ 5న 2020 కర్నూలు జిల్లాలో మంత్రాలయం మండలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేష పడగలనుధ్వంసం అక్టోబర్ 16న వెనకబడిన వర్గాల బీసీలకు 56 కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తూ చారిత్రిక నిర్ణయం తీసుకుని వెనకబడిన వర్గాలకు మంచి చేయించే కార్యక్రమం కి శ్రీకారం చుట్టాం, ఆర్ల పాడు గ్రామంలో వీర భద్రస్వామి దేవస్థానం గోపురం ధ్వంశం అంటూ ఆ తర్వాత రోజే 17 అక్టోబర్ 2020 న మీడియాలో ప్రచారం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో 30 లక్షల మంది పేద అక్క చెల్లెమ్మలకు 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో ఇస్తా ఉంటే తిరుపతి ఉత్సవాల్లో ఏర్పాటుచేసిన పూర్ణకుంభం లైటింగ్ ను దూరం నుంచి ఫోటో తీసి సిలువ అంటూ ప్రచారం సిలువ కాకపోయినా😀.
విజయనగరం లో ఇళ్ల పట్టాలు పంచేందుకు అక్కడకు వెళ్లి జగన్ అక్కడకు వస్తున్నాడు అని తెలిసి జగన్ వెళ్లే సమయానికి కరెక్టుగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయం రాముల వారి విగ్రహం పై దాడి, ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇంకా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో దాడి, ఆశ్చర్యమేమిటంటే చాలా వరకు గుడ్లు చూస్తే ఇంకా ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాలలో జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధ రాత్రిపూట జరిగిన ఘటనలు మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఎటువంటి నేరాలను మనం ఈరోజు డీల్ చేయాల్సి వస్తుంది అని అంటే ఉదాహరణగా చెప్పిన అంటే ఈరోజు మనం డీల్ చేసే కార్యక్రమాలు ఏది అయితే చేస్తా ఉన్నాము "ignite" అనే పేరుతో డెలిబ్రేషన్స్ , డిస్కషన్స్ ఏది అయితే చేస్తాఉన్నామో నాట్ ఓన్లీ ఇయర్ మిగిలిన అస్పెక్ట్స్ అన్ని ఏ రకంగా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అస్పెక్ట్స్ గా భావించి crimes తగ్గించేందుకు ఎఫిషియన్సీ ని పెంచేందుకు ఏ రకంగా మనం టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా డెలిబ్రేషన్స్ చేసి ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీస్తీసుకొచ్చే కార్యక్రమం చేయడానికి మనల్ని మనం ప్రేరేపించుకుంటూ ignite అని చెప్పి రగుల్చుకోవడం చేస్తా ఉన్నామో దానిలో భాగంగా ఈ పొలిటికల్ గా జరుగుతున్న గొరిల్లా వార్ ఫెయిర్ ని కూడా "we need to tally that situation" ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు కావాలని చెప్పి చెడ్డపేరు తీసుకొచ్చి కార్యక్రమం మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా పబ్లిసిటీ డైవర్ట్ చేయాలి అని దుర్మార్గం చేస్తా ఉన్న దుర్బుద్ధితో వచ్చే ఆలోచనలతో చేస్తా వున్నా కార్యక్రమాలు వీటి మీద కూడా దయచేసి మీ డెలిబ్రేషన్స్ లోను , మీ డిస్కషన్స్ లోను ignite అనే కార్యక్రమంలో వీటిని కూడా తీసుకుని రండి మీ డిబేట్స్ లలో. ఈ విధంగా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు.


Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....