ఆరడుగుల హీరోలకు హైబ్రిడ్ పిల్ల ఫిదా అయ్యిందా?

hybrid-pilla-paired-with-6-feet-heros
ఆరడుగుల హీరోలకు హైబ్రిడ్ పిల్ల ఫిదా అయ్యిందా?

ఆరడుగుల హీరోలకు హైబ్రిడ్ పిల్ల ఫిదా అయ్యిందా? :

సినిమా ఇండస్ట్రీ లో సాధారణంగా మూవీ స్టోరీ ని బట్టి పాత్రలను దృష్టిలో పెట్టుకుని హీరో హీరోయిన్ల యొక్క ఎంపిక అనేది జరుగుతుంది. హీరో పొడవును (ఎత్తు) ను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ను ఎంపిక చేస్తుంటారు. అలా అయితేనే అప్పుడే ఆ జంట వెండితెరపై చాలా చూడముచ్చటగా ఉంటుంది. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అనేది సెట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అవుతుంది.  కానీ హీరో హైట్ కి సెట్ అవ్వని హీరోయిన్ లను పక్కన పెట్టేస్తూ హీరో హైట్ కి తగిన pair గా ఎవరు బాగుంటారనే వెతుకులాట అనేది ఓ రేంజ్ లో కొనసాగిస్తారు అనే చెప్పాలి. కానీ కేరళకుట్టి సాయిపల్లవి విషయంలో మాత్రం ఇలాంటివి పట్టింవులు లేకపోవడం అనేది విశేషంగానే చెప్పాలి.

హీరోయిన్ సాయిపల్లవి యొక్క హైట్ తక్కువ కాబట్టి.. నేచురల్ స్టార్ నానీ లేదా శర్వానంద్ లాంటి మీడియం పొడవు ఉన్న హీరోలకు జోడీగా సాయిపల్లవి సరిగ్గా సెట్ అయిపోతుంది. కానీ తెలుగులో వచ్చిన తన మొదటి మూవీనే ఆరడుగుల అందగాడైన మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి జోడీగా ఫిదా మూవీ నటించడం విశేషం. అయితే ఆ మూవీలో కథాకథనాలు మరియు నేపథ్యాలు ఇంకా పాత్రలను తీర్చిదిద్దిన తీరు కారణంగా ఆ విషయాన్నిపెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కడా కూడా అది ఒక లోపంగా ఎవరికి అనిపించలేదు. ఫిదా మూవీకి ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సూపర్ హిట్ చేసారు.

hybrid-pilla-paired-with-6-feet-heros
ఆరడుగుల హీరోలకు హైబ్రిడ్ పిల్ల ఫిదా అయ్యిందా?
రీసెంట్ గా వస్తున్న 'విరాటపర్వం' మూవీలోను కూడా ఆమె హీరో రానా దగ్గుబాటి సరసన నటించింది. హీరో రానా యొక్క పొడవు వచ్చేసరికి 6 అడుగుల పైనే ఉంటుంది. విరాటపర్వం సినిమా లో వీరిద్దరి పాత్ర ఎలా ఉంటుంది? వీరి పాత్రల మధ్య సంబంధం ఏంటి? ఈ మూవీ లో పాటలు ఉంటాయా ఉండవా? అనే సంగతులు అయితే ఎవరికి తెలియదుగానీ హీరో రానా పక్కన సాయిపల్లవి సెట్ అవుతుందా లేదా? అనే డౌట్ లు మాత్రం చూసే ప్రేక్షకులకి కలిగింది అనే చెప్పాలి. ఒకవేళ విరాటపర్వం సినిమాలో ఈ ఇద్దరూ కూడా లవర్స్ అయ్యివుండరు అనుకుంటే మరోపక్క గోపీచంద్ సినిమాలో సాయిపల్లవి ని జోడీగా తీసుకున్నారనే గుసగుసలు తాజాగా వినిపిస్తోంది.

హీరో గోపీచంద్ తో కలిసి డైరెక్టర్ తేజ 'అలమేలుమంగ వెంకటరమణ' అనే మూవీ ని చేస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ యొక్క పాత్ర చేయడం కోసం సాయిపల్లవి ని ఎంచుకున్నారని అంటున్నారు. గోపీచంద్ కూడా మంచి హైట్ పర్సనాలిటీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా హైబ్రిడ్ పిల్ల లాంటి ఈ భామకి 6 అడుగులున్న హీరోల పక్కనే ఎక్కువ అవకాశాలు రావడం అనేది విశేషంగానే భావించాలి. అందువల్ల ఆమె హైట్ అనేది పెద్ద ప్రాబ్లెమ్ కాదు అనుకోవడం మరో విశేషంగా చెప్పాలి. అందుకుగల కారణం ఆమె లోపాలన్నీ కవర్ చేసే అసమానమైన అభినయం అనే చెప్పాలి!

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....