యంగ్ హీరో రాజ్ తరుణ్ "పవర్ ప్లే"

rajtarun-powerplay-movie-firstlook-motion-poster-release
యంగ్ హీరో రాజ్ తరుణ్ "పవర్ ప్లే"

యంగ్ హీరో రాజ్ తరుణ్ "పవర్ ప్లే" :

తెలుగు ఇండస్ట్రీ లో యువ కధానాయకుడు రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "పవర్ ప్లే". శ్రీమతి పద్మగారి సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేవేష్ మరియు మహిదర్ లు కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ Motion Poster ను వెర్సటైల్ హీరో రానా విడుదల చేసి 'పవర్ ప్లే' మూవీ టీమ్ అందరికీ కూడా అయన బెస్ట్ విషెస్ తెలిపారు. 

దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ : 

"పవర్ ప్లే" సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ నివిడుదల చేసిన హీరో రానా గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. పోస్టర్ లో మీరు ఎప్పుడూ చూడని విధముగా హీరో రాజ్ తరుణ్ లుక్ ఎలా డిఫరెంట్ గా ఉందో మూవీ కూడా అలానే డిఫరెంట్ గా ఉండబోతుంది, నేను మరియు రాజ్ తరుణ్ కలిసి ఇంతవరకూ చేయని కొత్త జోనర్లో ఒక భిన్నమైన థ్రిల్లర్ మూవీ గా ఉంటుంది అని అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ : 

డైరెక్టర్ విజయ్ కుమార్ గారితో రీసెంట్ గా OTT లో రిలీజ్ అయిన 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ చేశాను. ఆ మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరొక సరికొత్త జోనర్లో  డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ చేస్తున్నాను. కావున నాకు ఇది ఒక కొత్త ఎక్సపీరియన్స్ గా చూపొచ్చు, ఆడియన్స్ కు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేలా ఉంటుంది అని అన్నారు.

మూవీ నిర్మాతలు మహిదర్, దేవేష్ మాట్లాడుతూ :

ఒరేయ్ బుజ్జిగా మూవీ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత హీరో రాజ్ తరుణ్, డైరెక్టర్ విజయ్ కుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా మీద మంచి ఊహాగానాలు ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా డైరెక్టర్ విజయ గారు చాలా బాగా మూవీ తీశారు. థ్రిల్లర్ జోనర్లో నే ఒక సెపరేట్ ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని అన్నారు.

సలపర్తి అనంత్ పాయి (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) మాట్లాడుతూ :

ఈ మూవీ చిత్రీకరణ పనులు అయితే పూర్తయ్యయి. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తప్పకుండా ఈ చిత్రం థ్రిల్లర్ జోనర్లో నే కాకుండా అన్ని వర్గాల సినీ ప్రేక్షకులని అలరిస్తుంది అని అన్నారు.  

ఈ మూవీ లో హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ గా హేమల్ ఇంగ్లే, పూర్ణ నటిస్తున్నారు. కోటా శ్రీనివాసరావు, అజయ్, మధు నందన్, ధన్ రాజ్, రాజా రవీంద్ర, భూపాల్, కేదరి శంకర్ టిల్లు వేణు, సంధ్య జనక్, అప్పాజీ, రవివర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా, కో- డైరెక్టర్ : వేణు కురపాటి, నిర్మాతలు : మహిదర్, దేవేష్, ఈ చిత్రానికి కథ-మాటలు : నంధ్యాల రవి మరియు సినిమాటోగ్రఫీ : ఐ. ఆండ్రూ, ఆర్ట్ : శివ, సంగీతం : సురేష్ బొబ్బిలి మరియు ఫైట్స్ : 'రియల్ సతీష్, ఎడిటింగ్ : ఏప్రిణ్ పూడి & ప్రొడక్షన్ కంట్రోలర్ : బి.వి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పలపర్తి అనంత్ సాయి మరియు సమర్పణ : శ్రీమతి పద్మ.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....