![]() |
యూత్ కింగ్ అక్కినేని బ్యాచిరల్ విశేషాలు... |
యూత్ కింగ్ అక్కినేని బ్యాచిరల్ విశేషాలు :
యూత్
కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో జీఎ2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మాతలు
బన్నీ వాసు వాసు వర్మ నిర్మిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అయితే ఈ
చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేసింది ఈ చిత్ర బృందం. అఖిల్ ఫస్ట్ లుక్ ఒక్క అక్కినేని అభిమానుల నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుండి సైతం మంచి స్పందన వస్తుంది. ఇక ఈ సినిమా లో అఖిల్ కి సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది ఫిబ్రవరి 15 నుంచి తరవాత షెడ్యూల్ మొదలుకానుంది.
Also Read : రెండవ పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చిన అమలాపాల్!!
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. హైదరాబాద్,
అమెరికా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర బృందం ఇప్పుడు అదే
ఉత్సాహంతో ఫిబ్రవరి 15 నుంచి ఇంకో కొత్త షెడ్యూల్ను కూడా జరపబోతున్నారు. అయితే ఈ షెడ్యూల్లో
మేజర్ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. గోపీ
సుందర్ మ్యూజికల్ మ్యాజిక్ 22 పిక్చర్స్ బేనర్‌లో వచ్చిన గీతగోవిందం'
సినిమాకి గోపీ సుందర్ చాలా మంచి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి కూడా ఆరు బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీ
చేశారు. ఈ ఆరు పాటల్లో తెలుగు పాటలు ఇప్పటికే చిత్రీకరణ జరుపుకున్నాయట. ఇక అలానే మిగతా రెండు పాటలు ఫారిన్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారట.
ఏప్రిల్ విడుదల వరుస విజయాలతో దూసుకుపోతున్న జీఎ2 పిక్చర్స్ పిల్లా నువ్వు
లేని జీవితం, భలే భలే మగాడివోయ్. గీతగోవిందం,
ప్రతిరోజూ పండగే' వంటి సూపర్ హిట్స్ చిత్రాలను అందించిన యంగ్ ప్రొడ్యూసర్ బన్ని వాసు
మరోసారి అదే ఉత్సాహంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని అసల ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అదలాఉంటే ఈ సినిమాను ఏప్రిల్ లో
విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. యూత్ కింగ్ అఖిల్ అక్కినేని,
పూజా హెగ్డే ఆమని, మురళీ శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్
శ్రీను, అభయ్ అమిత్ ఇలా తదితరుల నటీ నటులు నటిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....