ఫోన్ లో ఈ యాప్ తోనే సినిమాలు కూడా తీయ్యెచు..!

how-to-make-a-movie-with-mobile-phone
ఫోన్ లో ఈ యాప్ తోనే సినిమాలు కూడా తీయ్యెచు..!

ఫోన్ లో ఈ యాప్ తోనే సినిమాలు కూడా తీయ్యెచు : 

మీరు వీడియో తీయాలనుకుంటున్నారు అవునా. తరవాత దానిని ఎలా తియ్యలా అనే ఆలోచన కూడా మీ మనసులో ఉంది. దానికోసం స్క్రిప్టు కూడా రాసుకుని ఉంచుకున్నారు. ఇక తీయడమే మిగిలి ఉంది అవునా? కానీ ఇకముందు మీకు ఆ అవసరం ఉండదు. మీరు రాసుకున్నదాన్ని మీ స్మార్ట్ ఫోన్ ఆప్ లోకి పంపితె చాలు... అదే దానికి సంబంధించిన వీడియో తీసి ఇచ్చేస్తుంది. 

రైట్-ఎ-వీడియో పేరుతో ఈ టూల్ ని ఈ మధ్య హార్వర్డ్, చైనాలోని సింగువా బీహాంగ్ అనే విశ్వవిద్యాలయ నిపుణులు ఇజ్రాయెల్ కు చెందిన ఐడిసి హెర్జిలియా యూనివర్సిటీ బృందంతో కలిసి రూపొందించారు. స్క్రిప్టులో రాసిన విషయాన్ని అర్థం చేసుకుని దానికి అందుబాటులో ఉన్న ఫొటోలూ బొమ్మలతో కథకి అనుగుణంగా ఎంతో సులువుగా వీడియోని తీసేస్తుందట. పైగా దీనివల్ల మనకు వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వాటి అవసరం కూడా ఉండదట. ఒకవేళ వీడియో పూర్తయ్యాక స్క్రిప్టులో ఏదైనా మార్పులు,చేర్పులు చేస్తే మళ్లీ అది దానికి తగ్గట్లే అది షాట్ తీయడం, ఉన్నదాన్ని డిలీట్ చేయడం వంటివి చేసి ఫైనల్ కాపీని మనకి అందిస్తుంది. 

Also Read : కొబ్బరిపాల కూర ఈ విధంగా వండితే భలే రుచిగా ఉంటుంది! 

ఈ టూల్ ద్వారా తీసిన వీడియోలు ఎంతో సహజంగా ఉన్నాయట. దాంతో ఈ టూల్ యానిమేటెడ్, గ్రాఫిక్స్ గేమింగ్ వంటి రంగాల్లో కూడా వీడియో సినిమాలు తీయడానికి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు దీనికి సంబంధిత నిపుణులు అయితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ అనేది మానవ సృజనకే పోటీ వచ్చినా ఆశ్చర్యం లేదు.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....