భారతదేశాని కి ముఖ్య అతిధులు విచ్చేసే వారి కోరికలు ఏంటో ..? ఎలా ఉంటాయో తెలుసా ?


wishes-of-the-chief-guests-of-India-visiting-itc-mourya
భారతదేశాని కి ముఖ్య అతిధులు విచ్చేసే వారి కోరికలు ఏంటో ..? ఎలా ఉంటాయో తెలుసా ?
భారతదేశాని కి ముఖ్య అతిధులు విచ్చేసే వారి కోరికలు :

సాధారణంగా మన భారతదేశ సందర్భనకు, గణతంత్ర వేడుకలకు వచ్చిన ముఖ్య అతిథులు, మరియు ఇతర విదేశీ ప్రముఖులు అందరు రాష్ట్రపతి భవన్ లోనే ఉంటారు. ఢిల్లీ నగర మధ్యలో రైసినా కొండపైన నిర్మితమైన ఓ అద్భుతమైన అధ్యక్ష భవనం అది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించిన భారత అధ్యక్షుడి 340 గదుల అధికారిక నివాసం. ఇక్కడే 1950 నుంచి గణతంత్ర వేడుకలకు వచ్చే విదేశీ అతిథులకు విడిది ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ సంప్రదాయాన్ని పాటించని కొందరు ముఖ్య అతిథులు కూడా ఉన్నారు. అలాంటి వారికీ వారు కోరుకున్న హోటల్లో వారికి విడిది ఏర్పాటుచేస్తారు. 

2015లో 66వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు కూడా ఢిల్లీలో అత్యంత ఆధునిక వసతులు గల హోటల్ లో ఒకటైన ఐటిసి మౌర్య షెరాటను వారు ఎంపిక చేసుకున్నారు. అప్పడు దాంతో ఒబామాకు ఆ హోటల్ లోనే బస ఏర్పాటు చేశారు. భద్రత రీత్యా 14వ అంతస్తులోవున్న 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ప్రెసిడెన్షియల్ సూటు ఏర్పాటుచేశారు. అలాగే 2014 లో వేడుకలకు అతిథిగా విచ్చేసిన జపనీస్ ప్రధానమంత్రి షింజో ఆ బే తాజ్ ప్యాలెస్ హోటల్ లో బస ఏర్పటు చేశారు. 

Also Read : హైదరాబాద్ నగరం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు!!

అయితే సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి భవనంలో ఉండటాన్ని చేదించిన మొదటి విదేశీ నాయకులలో ఒకరు జాక్వెస్ చిరాక్, మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు అయిన జాక్వెస్ చిరాక్ వారు 1998లో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే అప్పుడు ఆయన కూడా వచ్చిన కొంతమంది జర్నలిస్టులకు బార్, స్విమ్మింగ్ లాంటి సౌకర్యాలు కావాలని అనడంతో ఆయన బృందానికి హోటల్ లో విడిది ఏర్పాటుచేశారు. రిపబ్లిక్ డే ముఖ్య అతిథి రాష్ట్రపతి భవన్లో చివరిసారిగా 2013లో ఉన్నారు. భూటాన్ రాజు కింగ్ జిగ్మే ఫేసర్ నామ్ గెల్ వాంగ్చక్, భూటాన్ రాణి జెట్సన్ పెమా. అప్పట్లో "భూటాన్ రాజు సాంప్రదాయకంగా రాష్ట్రపతి భవన్ లో ఉన్నారు." అని పత్రికలు వారు ప్రత్రికలో కొనియాడారు.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....